మాయదారి కరోనా మన ప్రాణాలకి ఎలా దాపురించిందో కానీ..అప్పటి నుండి మనిషి మనిషికి సంబంధం లేకుండా చేసింది. అక్కడెక్కడో చైనలో పుట్టిన ఈ కరోనా మహమారి క్రమీనా ప్రపంచ దేశాలకు పాకేసి..గత రెండేళ్లుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది. చిన్న-పెద్ద తేడాలేకుండా అందరికి సోకుతున్న ఈ కరోనా మహమ్మారికి ఇప్పటికి కొన్ని లక్షల మంది ప్రాణాలు వదిలేసారు.

ఈ మధ్య వస్తున్న సినిమాలు చూస్తున్నట్లైతే పార్ట్ 1..పార్ట్ 2.. లాగా కరోనా కూడా ఫేస్ 1..ఫేస్ 2 అంటూ పూటకో కొత్త విధంగా తన రూపం మార్చుకుంటూ ప్రజల పై తన పంజా విసురుతుంది. ఒక్కప్పుడు తుమ్మితే శత ఆయుష్ నూరేళ్ల ఆయుష్ అని అనేవారు.. కానీ ఇప్పుడు ఎవరి ముందు అయిన తుమ్మితే.. నీకు దండం పెడతాం రా బాబు దూరంగా వెళ్లు .. నీకు కరోనా ఏమో టెస్ట్ చేయ్యించుకో అంటున్నారు. చదవడానికి కామెడీ గా ఉన్నా కూడా ఇది నిజం. అలాంటి పరిస్ధితులు దాపురించాయి మనకు.

అయితే అసలే ఈ రక రకాల కరోనాతో చస్తుంటే.. ఇప్పుడు కొత్తగా ప్రజలని చంపుకోడానికి తెర పైకి మరో వ్యాధి వచ్చిన్నట్లు తెలుస్తుంది. ప్రపంచ దేశాలను  అల్లాడించే అగ్ర రాజ్యం అమెరికా ఈ కొత్త వ్యాధిన పడి అల్లాడిపోతుందట. ఇంతకు ఆ వ్యాధి పేరు ఏంటో తెలుసా..? సాల్మోనెల్లా. యస్..అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న ఆ వ్యాధి పేరు సాల్మోనెల్లా. ఈ వ్యాధి ఉల్లిగ‌డ్డ‌ల ద్వారా వ్యాపిస్తుందట. ఇప్పటికే ఈ వ్యాధి 652 మందికి  సోక‌గా 129 మంది హాస్పిటల్ ల్లో  చికిత్స తీసుకుంటున్నట్లు సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ గురువారం వెల్ల‌డించింది. ఎరుపు, తెలుపు, గోధుమ రంగులో ఉండే ఈ ఉల్లి స్టోరేజ్ కూల‌ర్ల‌లో  క‌నిపిస్తే వెంట‌నే పార‌వేయాల‌ని  ఆ తరువాత శుభ్రం చేసి శానిటైజ్ చేయాల‌ని సీడీసీ ఆయా దుకాణాలు, రెస్టారెంట్ల‌ను కోరుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: