ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.. ఈ దాడుల విషయంలో వైసీపీ, టీడీపీల పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా, అసలు సంబంధమేలేని పవన్ కళ్యాణ్ ఈ వివాదంలో చిక్కుకున్నారు. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిన విషయం తెలియగానే పవన్ స్పందించారు. దాడి జరిగిన సమయంలో ప్రత్యేక సమావేశంలో ఉన్న పవన్.. అక్కడి నుంచే ఆఘమేఘాల మీద, ఇలా దాడులు చేయడం సరికాదంటూ వీడియో విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై దాడులు మంచిది కాదని హితవు పలికారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ కలుగజేసుకోవాలని కూడా చెప్పారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనపై వైసీపీ విమర్శలకు తావిచ్చాయి.

పవన్ కల్యాణ్ టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిన రోజున చేసిన ప్రకటన వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. ఆ దెబ్బతో ఆయన వైసీపీకి నేరుగా టార్గెట్ అయ్యారు.  
సీఎం జగన్ కు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ నేతలు చేస్తున్న జనాగ్రహ దీక్షల్లో చంద్రబాబుతో పాటు పనిలో పనిగా పవన్ కల్యాణ్ పై కూడా విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టిమరీ విమర్శిస్తున్నారు. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే పవన్ కు బాధేమిటి అంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తమ అధినేత జగన్ ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే పవన్ అప్పుడెందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా న్యాయంకోసం చంద్రబాబు 36 గంటల నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.. వీటికి పోటీగా వైసీపీ నేతలు కూడా ఊరూరా జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. తమ అధినేత జగన్ పై విమర్శలు చేసిన వారిని టీడీపీ సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆందోళనలు, ర్యాలీలు చేసేస్తున్నారు. ఈ ఆందోళనల్లో పవన్ అనవసరంగా బుక్ అయ్యారు. చంద్రబాబుతో పాటూ పనిలో పనిగా జనసేన అధినేతకు కూడా క్లాస్ పీకుతున్నారు వైసీపీ నేతలు..

మరింత సమాచారం తెలుసుకోండి: