క‌ర్నూలు జిల్లాలో గ‌త ద‌శాబ్ద కాలం నుంచి ఆ ప్రాంతం ర‌క్త‌సిక్తంగా మారుతున్న‌ది. జిల్లాలోని హోల‌గుంద మండ‌లం దేవ‌ర‌గ‌ట్టులో ప్ర‌తి ఏడాది క‌ర్ర‌ల‌తో పెద్ద స‌మ‌రం జ‌రుపుకుంటారు. ఇది తాత‌ల కాలం నాటి నుంచి ఆన‌వాయితీ అని పేర్కొంటుంటారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఇది జ‌రుపుకుంటారు. దీనికి బ‌న్నీ ఉత్స‌వం అని పేరు పెట్టారు. ఈ ఉత్స‌వంలో ర‌క్త‌సిక్త‌మ‌వుతారు. ఈసారి జ‌రిగిన క‌ర్ర‌ల స‌మ‌రంలో హింస చెల‌రేగింది. దాదాపుగా 100 మందికి పైగా గాయాల పాల‌య్యారు.

ఒక వ‌ర్గం వారు మ‌రొక వ‌ర్గాన్ని అడ్డుకోవ‌డం.. ఇలా రెండు వ‌ర్గాలు క‌ర్ర‌ల‌తో దాడులు చేసుకోవ‌డం జ‌రుగుతుంటుంది. ఈదాడిలో చాలా మంది త‌ల‌లు ప‌గిలిపోతాయి. వంద‌ల సంఖ్య‌లో గాయాల‌వుతుంటాయి. ఇలా చేసుకుంటేనే ఆ గ్రామం సుఖ‌, సంతోషాల‌తో ఉంటుంది అని గ్రామ‌స్తులు పేర్కొంటారు. లేక‌పోతే గ్రామంలో ఏదో ఒక ఘ‌ట‌న చోటు చేసుకుంటుంద‌నేది వారి న‌మ్మ‌కం.

క‌ర్నూలు జిల్లాలోని దేవ‌ర‌గ‌ట్టులో సుమారుగా 800 అడుగుల ఎత్తైన కొండ‌పైన మాల మ‌ల్లేశ్వ‌ర‌స్వామి ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తుంటారు. ఈ  ఉత్స‌వానికి చాలా ప్ర‌త్యేక‌త ఉన్న‌ది. ఉత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారుల‌ను ద‌క్కించుకోవ‌డానికి నేర‌ణికి, నేర‌ణికి తండా, కొత్త‌పేట గ్రామాల భ‌క్తులు ఒక వైపు.. అరికెర‌, అరికెర‌తండా, సుళ్లువాయి., ఎల్లార్తి, కురుకుంద,  బిలేహాల్‌, విరుపాపురం గ్రామాల భ‌క్తులు మ‌రొక వైపు గా క‌ర్ర‌ల‌తో దాడి చేసుకుంటుంటారు. ఈ దాడిలో ఎంతో మందివి త‌ల‌లు ప‌గ‌ల‌డం, కాళ్లు విర‌గ‌డం లాంటివి చోటు చేసుకుంటాయి. అయినా కానీ ఈ ఉత్స‌వాన్ని ఆప‌రు. ఈ ఉత్స‌వాల‌ను ఆప‌డానికి ప్ర‌భుత్వం, పోలీసులు ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించినా విఫ‌లం చెందారు.  ఈ ఉత్స‌వాల కోసం ప్ర‌తీ సంవ‌త్స‌రం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేసినా హింస మాత్రం ఆగ‌లేదు. వంద‌కు పైగా గాయ‌ప‌డ్డారు. వారంద‌రూ ఆంధోనీ ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌భుత్వం, పోలీసులు ఈ ఉత్స‌వాన్ని అరికట్టాల‌ని  చూసిన ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరు.
మరింత సమాచారం తెలుసుకోండి: