కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్.. ఈ పేరు చెబితే చాలు ప్రపంచం వణికిపోతుంది. చైనాలోపుట్టిన ఈ మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కమ్మేసింది. లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంది. ఒకరినుంచి మరొకరికి సోకుతూ ప్రాణాలు తీసేసింది. భారత్ లోనూ విస్తరించి ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. కరోనా వైరస్ ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు తీసేసింది. అయితే ఇప్పుడు మరొక భయంకరమైన విషయం ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసేందుకు సిద్ధమైంది. చైనాలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ మొదలైనట్టు అక్కడి మీడియా నుంచి అందుతున్న సమాచారం..

తాజాగా చైనాలో కరోనా వైరస్ కేసులు బయట పడుతున్నాయి. మెల్లగా కేసుల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అందుకే అక్కడి అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. చాలానగరాల్లో కేసులు కనిపించడంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్స్ మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. కరోనా కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో ఎక్కడికక్కడే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు రావద్దని అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. పెళ్లిళ్లు, తదితర వేడుకలపైనా ఆంక్షలు విధించారు. కేసులు వస్తున్న ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

చైనాలో ఇప్పటికే 200 కోట్లకు పైగా కరోనా వాక్సిన్ డోసులను అక్కడి ప్రభుత్వం పంపిణీ చేసింది. అయినప్పటికీ కరోనా కేసులు వెలుగుచూడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. స్థానికుల గుండెల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో జరిగిన తప్పులు.. పునరావృతం కాకుండా ఇప్పటికే ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే బయటకు వచ్చేలా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే మొత్తం లాక్ డౌన్ చేసేలా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏది ఏమైనా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైతే మరోసారి ప్రపంచం కష్టాల్లో పడినట్టే..

మరింత సమాచారం తెలుసుకోండి: