రెండోసారి అధికారంలోకి వచ్చిన అధికార టీఆర్ఎస్ పార్టీకి అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా వేగంగా పుంజుకోవడం గమనార్హం. ఇక ఇటీవల సి ఓటర్ నేషనల్ సర్వేలో సీఎం కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. భారతదేశంలోని అత్యంత ప్రజా వ్యతిరేకత ఉన్న సీఎం లలో... గులాబీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉండటం కొసమెరుపు. దాదాపు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా 30 శాతం మంది ఉన్నట్లు సి ఓటర్ స్పష్టం చేసింది. 

అలాగే  ఇండియాలోని ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ లో ఉన్న వారే కావడం విశేషం. ఇందులో లో ఎక్కువ శాతం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. తెలంగాణలోని ఎమ్మెల్యేలపై 23 శాతం పైన వ్యతిరేకత ఉందని సి ఓటర్ సర్వే వెల్లడించింది. అంటే ఈ లెక్కన అధికార టీఆర్ఎస్ పార్టీ తో పాటు సీఎం కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ముందు ఈ సర్వే రావడం అధికార టీఆర్ఎస్ పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది.

సర్వే కారణంగా హుజరాబాద్ నియోజకవర్గం లో  అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని తప్పదని అందరూ అనుకుంటున్నారు. ఇక హుజురాబాద్ నియోజక వర్గానికి సంబంధించిన సి ఓటర్ సర్వే కూడా బయటపడినట్లు సమాచారం అందుతోంది.  ఈ సి ఓటర్ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ కి 49 శాతం, అధి కార టీఆర్ఎ స్ పార్టీకి 34 శాతం, కాంగ్రెస్ పార్టీకి 16 శాతం ఓట్లు పడ్డట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తాని కి ఉప ఎన్నికల వేళ... సి ఓటర్ సర్వే సీఎం కేసీఆ ర్ కు ఊహిం చని షా క్ ఇచ్చిం ది.

మరింత సమాచారం తెలుసుకోండి: