గంజాయి సాగుకు సంబంధించి రేగుతున్న వివాదాల్లో ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా స‌మ‌స్య తీవ్ర‌త‌ను పెంచేందుకు శక్తిమేర కృషి చేస్తున్నారు. ఇదే అదునుగా ఇరు వర్గాలూ రాజ‌కీయ ల‌బ్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారే త‌ప్ప స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు త‌మ చొరవ ఏంట‌న్న‌ది చెప్ప‌డం లేదు. ఎప్ప‌టి నుంచో విశాఖ మ‌న్యంలో గంజాయి సాగు ఎప్ప‌టి నుంచో ఉన్న విష‌యం. వీటిపై మాట్లాడాల్సినంత మాట్లాడాలి. రాజ‌కీయాల‌కు అతీతంగా రాష్ట్రం ప‌రువు కాపాడాలి. అవేవీ ఇక్క‌డ జ‌ర‌గ‌డం లేదు.

మ‌నుషులు రాజ‌కీయాలు రెండూ వేర్వేరుగా ఉండ‌వు. సామాజిక తాప‌త్ర‌యం ఒక‌టి మ‌నిషి కి ఉంటే, చుట్టూ గంజాయి వ‌నాల సాగు అన్నదే ఉండ‌దు. ఆఖ‌రికి ఆ గిరిజ‌నుల‌కు ఉన్న కొద్దిపాటి ఆలోచ‌నే మ‌న నాయ‌కుల‌కూ ఉంటే గంజాయి వ‌నాలు స‌మూలగా నాశ‌నం అవుతాయి. ఆ ప‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేయొచ్చు. కానీ వాటిపై దృష్టి ఉంచ‌కుండా అన‌వ‌స‌ర రాద్ధాంతాలకు తోడుగా నిలుస్తోంది. గంజాయి తోట‌ల నాశ‌నం, ర‌వాణాపై నియంత్ర‌ణ, స‌రిహ‌ద్దుల‌పై నిరంతర పర్య‌వేక్ష‌ణ అన్న‌వి ఇప్పుడు అత్యావ‌శ్య‌కాలు. వీటిని వ‌దిలి వైసీపీ స‌ర్కారు ఆలోచిస్తుంది. రాజకీయం చేస్తుంది.

రాజకీయంలో భాష కోసం ఎంతయినా తాప‌త్ర‌య ప‌డాల్సిందే. ఒక్క చిన్న త‌ప్పు ప‌దం ప‌లికినా అదొక రాద్ధాంత‌మే. లేదంటే మ‌న భాష పై మ‌న‌కు ఉన్న ప‌ట్టు ఒక‌టి ప్ర‌జ‌ల ముందు ఎంత‌న్న‌ది తేలిపోతుంది. ఈ త‌రుణంలో కొత్త యుద్ధాల‌కు ఆరంభం దొరుకుతుం ది. పాత స‌మ‌స్య‌లు మ‌రిన్ని రాజుకుంటాయి. ఎప్పుడో మాట్లాడిన మాట‌ల‌కూ ఓ చ‌ర్చ న‌డుస్తోంది. అదేవిశంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా నాయ‌కులు ఉండ‌రు. ఉన్నా కూడా పైకి న‌టిస్తారు. ఈ విష‌యంలో పెద్ద‌రికం న‌డ‌వ‌దు. రాష్ట్రంలో న‌డుస్తున్న బూతుల‌పై వివాదం ఇప్ప‌ట్లో తేల‌దు. ఇరు వ‌ర్గాలూ కూడా వాటిపై బాగానే  మాట్లాడుతున్నారు. అంతా మంచోళ్లే అన్న భావ‌న ఒక‌టి ఉంటుంది. ఆ విధంగా ఈ విష‌యం వ‌దిలేయాలి. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ మాట్లాడిన భాషేంటి అన్న ద‌గ్గ‌ర మొద‌ల‌యి..ప‌ట్టాభి మాట్లాడిన భాషేంటి అన్న విష‌యం ద‌గ్గ‌ర ఆగుతుంది. వివాదం స్థాయి పెంచే క్ర‌మంలో ఇరు వ‌ర్గాలూ చేస్తున్న కృషి స‌ఫ‌లీకృతం అయింది. ఇంకాస్త ప్ర‌జ‌లపై మీరు ప్రేమ పెంచుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: