ఏపీ రాజకీయం రంజుగా మారుతుంది. అధికార వైసీపీ, విపక్ష టిడిపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీని ఎవరైనా విమర్శిస్తే నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి జైలులో పెట్టి .. ఊచ‌లు లెక్కపెట్టేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి గత ఎన్నికలలో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. జనసేన కు దూర‌మై వైసిపి చెంత చేరి పోయారు. ఆయన అటు అసెంబ్లీ లోనూ .. ఇటు బ‌య‌టా అన‌ధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగానే కొన‌సాగుతున్నారు.

అయితే రాపాక పార్టీ కండువా మార్చేస్తే ఫిరాయింపు చ‌ట్టం క్రింద ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఏపీ లో అధికార వైసీపీ టీడీపీ కి కౌంట‌ర్లుగా రాష్ట్రం అంత‌టా వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌లు జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. ఈ జ‌నాగ్ర‌హ దీక్ష‌లో రాపాక వ‌ర ప్ర‌సాద రావు పాల్గొన్నారు. ఇక గ‌తంలోనే టీడీపీ , జ‌న‌సేన వాళ్లు రాపాక‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

రాపాక వైసీపీ కండువా వేసుకుని మ‌రీ దీక్ష‌లో పాల్గొన్నారు. ఈ వీడియో లు సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్ అయ్యాయి. అయితే ఇది స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దృష్టికి వెళితే ఆయ‌న చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే త‌మ్మినేని రాపాక వైసీపీ కండువా వేసు కున్న విష‌యాన్ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటారా ?  లేదా లైట్ తీస్కొంటారా ? అన్న‌ది చూడాలి. ఒక వేళ ఆయ‌న చ‌ర్య‌లు తీసు కోవాల‌ని అనుకుంటే రాపాక శాస‌న స‌భ్య‌త్వం ర‌ద్ద‌వుతుంది. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్యే లుగా గెలిచిన మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు, వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ , వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ , క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మారినా వారు వైసీపీ కండువా క‌ప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: