కొంత మిశ్ర‌మ ఫ‌లితాల నేప‌థ్యంలో నైరుతి ఈ ఏడాది నిష్క్ర‌మిస్తోంది. తుఫానుల అల‌జ‌డులు ఉన్నాయి. అదేవిధంగా మంచి వా న‌లు ప‌డ్డాయ‌న్న ఆశా భావాలు వ్య‌క్తం అవుతున్నాయి. అందుకే మిశ్ర‌మ ఫ‌లితం అని రైతులు అంటున్నారు. పంట‌లు బాగా పం డే అవ‌కాశం ఉన్న చోట తుఫాను దెబ్బ బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల నైరుతి ఫ‌లితంగా ప‌డ్డ వాన‌లు చెరువుల‌కు జ‌ల క‌ళ‌లు ఇచ్చాయి. సాగునీటి వ‌న‌రుల పెంపుద‌ల‌కు తోడ్ప‌డ్డాయి. రుతు ప‌వ‌న ప్ర‌భావంతో వ‌ర్షాలు బాగానే ప‌డ్డాయ‌న్న భావ‌న ఉన్నా కొ న్ని చోట్ల వాతావ‌ర‌ణంలో అనూహ్య మార్పులు అయితే న‌మోదయ్యాయి. ప‌గ‌టి పూట ఉక్క‌పోత, రాత్రి వేళ‌ల్లో వాన ఇలాంటి ప‌రి ణామాలు కూడా చాలా చోట్ల క‌నిపిస్తున్నాయి.

ఈ ఏడాది పంట‌లు బాగానే పండుతాయి అని ఆశించిన రైతుకు గులాబ్ తుఫాను ఊహించ‌ని విధంగా ఇబ్బందుల్లో నెట్టేసింది. పం ట పోయిన బాధ‌లో రైతులు ఉన్నారు. సాయం అంద‌దు అని తేలిపోయింది కొన్ని చోట్ల‌. శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిధిలో 399 హెక్టార్ల‌లో
పంట‌న‌ష్టం వాటిల్లింది. దీంతో ప‌రిహారం విష‌య‌మై అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. కానీ అధికారులు మాత్రం ని బంధ‌న‌ల పేరిట ప‌రిహారం వివ‌రాలు న‌మోదులో తాత్సారం చేస్తున్నారు.

ఇవ‌న్నీ త‌మ పాలిట శాపాలుగా మారాయ‌ని రైతులు ఆవేద‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో  ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర కూ ఏ విష‌యం కూడా స్ప‌ష్టం చేయడం లేదు. వివిధ ఉచిత ప‌థ‌కాలు పేరిట ల‌క్ష కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తున్న ప్ర‌భుత్వానికి గు లాబ్ తుఫాను ప‌రిహారం మాత్రం అందించేందుకు అస్స‌లు మ‌న‌సు ఒప్ప‌డం లేద‌ని విప‌క్షం పెద‌వి విరుస్తోంది. సాయం కోసం రై తులు వేచి చూస్తున్నా స‌రైన భ‌రోసా మాత్రం ద‌క్క‌డం లేద‌ని  చెబుతోంది.

గులాబ్ తుఫాను మిన‌హాయించి చూస్తే ఈ సారి వ‌ర్షాలు ఆశాజ‌న‌కంగానే ఉన్నాయి. సాగునీటి వ‌న‌రులు పుష్క‌లంగానే ల‌భించేం దుకు ఆస్కారం ఉంది. భూగ‌ర్భ జ‌లాల పెరుగుద‌ల‌కూ అవ‌కాశం మెండుగానే ఉంది. ఈ సారి వాన‌లు సంబంధిత ప‌రిణామాలు కొన్ని చోట్ల రైతులకు అనుకూలించేందుకు ఉన్న అవ‌కాశాలే ఎక్కువ‌. నైరుతి నిష్క్ర‌మ‌ణ ప్ర‌భావం ఇంకా కొన్ని చోట్ల ఉంద‌ని, దీం తో వాన‌లు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది. నెలాఖ‌రులో మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర ణ శాఖ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap