అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి కీలక విషయాన్ని చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను కూడా వివరిస్తూ  వచ్చారు. అంతేకాదు వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రజలందరిలో కూడా ధైర్యాన్ని నింపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇలా కరోనా వైరస్ సమయంలో ఎన్నో సార్లు జాతిని ఉద్దేశించి మాట్లాడిన నరేంద్ర మోదీ ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి జాతినుద్దేశించి మాట్లాడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ప్రారంభమైంది   ఈ ప్రసంగంలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే 100 కోట్లు వ్యాక్సినేషన్ రికార్డును పూర్తిచేసుకుంది భారత్.  దీని గురించి ప్రధాని మోదీ మాట్లాడతారా లేకపోతే దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడుతారా అన్నది  హాట్ టాపిక్ గా మారిపోయింది. పెట్రోల్ డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాబోతున్నారు అని గతంలో టాక్ వినిపించింది. ఇక దీనికి సంబంధించి ఏ విధమైన ప్రకటన చేయబోతున్నారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది .  ఇక దాదాపు సామాన్య ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ ధరలపై శుభవార్త చెప్పబోతున్నారు అని ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. అంతే కాదు దీపావళి పండుగ సందర్భంగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్న మోదీ  అందరికీ శుభవార్త చెప్పబోతున్నారు అని కూడా ఎంతోమంది ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోది ఇక ఈ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో కొన్ని కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఇలా ప్రధాని నరేంద్ర మోడీ ఏ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి మాట్లాడ బోతున్నారు  అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నా రూటే సపరేటు అన్న విధంగా ముందుకు సాగుతారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరు ఊహకందని విధంగా కొత్త విషయాలను కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: