దేశ ప్రధాని నరేంద్ర మోడీ చాలా రోజుల తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించ పోతున్నారు ఇక ప్రధాని మోదీ నేడు 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించ పోతున్నారు అన్న విషయాన్ని ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే కరోనా వైరస్ సమయంలో చాలా సార్లు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సమిష్టిగా  వైరస్పై ఎలా పోరాడాలి అనే విషయంపై ప్రజలందరికీ దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాదు వ్యాక్సినేషన్ పై అందరిలో అవగాహన కల్పించేందుకు కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ క్రమంలోనే నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం లో ప్రధానంగా ఇలాంటి అంశాలు రాబోతున్నాయి అన్న దానిపై మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది  మోడీ ప్రసంగం పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏదైనా కీలక ప్రకటన చేయబోతున్నారా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది  అయితే ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు అంటూ ప్రధాని కార్యాలయం ఒక పోస్టు పెట్టగానే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మోదీ ఏం  మాట్లాడతారో తెలియదు కాబట్టి... ఓ విషయంపై మాట్లాడండి సార్ అంటూ తెగ రిక్వెస్ట్ లు    పెట్టేస్తున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటారా ఇంకేంటి దేశవ్యాప్తంగా సామాన్యుడికి భారంగా మారిపోయిన పెట్రోల్ ధరల గురించి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని.. ఇక ఈ ప్రసంగంలో దీనిపై మాకు శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాము అంటూ ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు పెడుతున్నారు. కొంతమంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడబోతున్నారు అని అంచనా వేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ప్రధాన ఏం మాట్లాడ బోతున్నారు అన్న దానిపై మాత్రం ఊహాగానాల లోకి వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: