తెలంగాణ ఉద్య‌మంలోనూ త‌రువాత కూడా ఆంధ్రా ప‌రిణామాల‌పై అక్క‌డి ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆస‌క్తి ఒక‌టి నెల‌కొని ఉంది. ఈ త‌రుణంలో ఆంధ్రాలో నెల‌కొన్న ప‌రిణామాల‌పై ఇక్క‌డి నాయ‌కుల తిట్ల పురాణంపై సామాజిక మాధ్య‌మాల్లో విభిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అ వుతున్నాయి. త‌మ నాయ‌కుల క‌న్నా మించి ఇక్క‌డి నాయ‌కులు ప్ర‌వ‌ర్తిస్తున్నారన్న వాద‌న కూడా తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది. కేసీఆర్ ను రేవంత్ తిట్టినా, రేవంత్ ను గులాబీ పెద్ద‌లు తిట్టినా వాటి హ‌ద్దు కేవ‌లం తిట్ల వ‌ర‌కే కానీ ఏనాడూ భౌతిక దాడులు జ‌ర‌గ‌లేదు కానీ ఇక్క‌డ అలా కాదు అని తేలిపోయింది. ఇలాంటి విష సంస్కృతి ని పెంచి పెద్ద చేయ‌డం అంటే అందుకు త‌గ్గ ప‌రిణామాల‌ను ముందు అర్థం చేసుకోవాలి.

 తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఒక‌రినొక‌రు తిట్టి పోసుకోవ‌డం వెనుక రాజ‌కీయ ఉద్దేశాలే కానీ ప్ర‌జా ప్ర‌యోజ‌నాలేవీ లేవు. అందుకే ఈ ప‌రిణామాలు మరింత వేడెక్క‌డం ఖాయం. ఇదే సంద‌ర్భంలో తెలంగాణ ఉద్య‌మ కాలంలో స‌మైక్య పాల‌కుల‌ను ఉద్దేశించి కేసీఆర్ తిట్టిన తిట్లు కూడా ప్ర‌స్తావ‌నకు వ‌స్తున్నాయి. కొన్ని ఉర్దూ పదాలు మిళితం అయి ఉండే తెలంగాణ తిట్ల‌కు అర్థాలు కూడా వెతికి మ‌రీ చెబుతున్నారు విశ్లేష‌కులు. ఇదంతా ఆస‌క్తిదాయ‌క‌మే! ఎందు కంటే తిట్లు అన్న‌వి ఇవాళ రాజ‌కీయాల‌లో ప్ర‌ధాన భూమిక పోషిస్తున్నాయి. అవి లేని రాజ‌కీయాలే లేవు. వీటిని దూరం ఉంచి మాట్లాడే నాయ‌కులే ఇప్పుడు అరుదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిణామాల‌పై పక్క రాష్ట్రం తెలంగాణ‌లోనూ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. సోష‌ల్ మీడియాలోనూ వీటిపై కామెంట్లు విని పిస్తున్నాయి. ప‌లువురు వ్యాసాల రూపంలో తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. తిట్ల సంస్కృతి ఉమ్మ‌డి ఆంధ్రాలోనూ ఉంది అని దామోద‌రం సంజీవ‌య్య హ‌యాంలోనూ ఇలాంటి మాట‌లే వినిపించాయి అని విశ్లేష‌కులు అంటున్నారు. అప్ప‌ట్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి కులం పేరుతో దూష‌ణ సాగించారని రాజ‌కీయ విశ్లేష‌కులు నాంచారయ్య  మెరుగుమాల అంటున్నారు.
ఆయ‌నేం అంటున్నారంటే.. "క‌ర్నూలు జిల్లాకు చెందిన మొదటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యను కాబినెట్ సమావేశంలో నెల్లూరుకు చెందిన సీనియర్ మంత్రి కులం పేరుతో బూతులు తిట్టిన ఘన చరిత్ర మన 'ఉమ్మడి' ఆంధ్రప్రదేశ్ కు ఉంది. ఇప్పుడు అవశేష ఆంధ్రలో తెలుగు నేత ఒకరు ప్రస్తుత సీఎంను జాతీయస్థాయి ఉత్తరాది తిట్టుతో దూషించడం ఎంతైనా ' మెరుగైన రాజకీయ సంస్కృతి' కి అద్దం పడుతోంది..."అని చెప్పారు.. సోష‌ల్ మీడియాలో త‌న పోస్టు ద్వారా..


మరింత సమాచారం తెలుసుకోండి: