భారత్ లో వాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. దీనిని విజయవంతంగా జరిపిస్తూ వస్తుంది ప్రభుత్వం. ఇప్పటివరకు వందకోట్ల వాక్సిన్ వితరణ జరగడంతో దానిని విజయంగా జరుపుకోవడానికి భారత్ సిద్ధం అయ్యింది. దానిని ప్రధాని నరేంద్రమోడీ నేడు జాతిని ఉద్దేశించి మాట్లాడటం ద్వారా వ్యక్తం చేయనున్నారు. కరోనా లో కాస్త తడపడినప్పటికీ, సొంత సాంకేతికత ద్వారా వాక్సిన్ ఉత్పత్తి తో భారత్ కి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆదరణ లభించింది. భారత్ ఈ పరిస్థితులను ఇంత విజయవంతంగా ఎదుర్కొంటుందని ఎవరు ఊహించలేకపోయారు. అదే అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక భారత్ లోనే వాక్సిన్ తయారీ, ఉపయోగం కూడా ప్రారంభం కావడంతో మరోసారి ప్రపంచం విస్తుపోయింది.

ఇలా కరోనా సమయంలో భారత్ ప్రపంచంలో తన ఉన్నత స్థాయిని పదిలపరుచుకోవడమే కాకుండా, ఇలాంటి సమయంలోనే పలు దేశాలకు వాక్సిన్ కూడా పంపిణి చేసింది. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలో భారత్ ను ఉన్నతంగా నిలబెట్టాయి. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా అందరు చూపిస్తూ దేశాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దుకోవడంలో అందరు భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. కేవలం భారత్ మాత్రమే కరోనా సమయంలో ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉందని ఆయన తెలిపారు. కరోనా సమయంలో అన్ని విషయాలకు పౌరులు చక్కగా సహకరించినట్టే, ఇంకొంత కాలం సహకరించి, కరోనా ను పూర్తిగా భారత్ నుండి అలాగే ప్రపంచం నుండి తరిమి కొట్టడానికి భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. వాక్సిన్ 100కోట్ల వితరణ అంత సులభం కాదని, అయినా భారత్ చేసి చూపింది అని ఆయన అన్నారు. ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయి, వాటివైపు అడుగులు వేద్దాం!

భారత్ ఎప్పుడు ఇలా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ, ఎన్నో వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నప్పటికీ వాటిని ఎదుర్కొంటు శాంతి, సహనంతో ముందుకు పోవాలని, దానికి అందరి సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఇంకా కొంత కాలం కరోనా మహమ్మారి నుండి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇప్పటికి కూడా  కొన్ని దేశాలు వైరస్ తో బాధింపబడుతూనే ఉన్నాయని, అది మానవరకు రాకముందే జాగర్తలు మరింత కాలం వహించక తప్పదని ఆయన అన్నారు. అలాగే ముందడుగు కూడా వేసుకుంటూ పోవటం మనకు అలవాటైనందున ఇక భారత్ ప్రపంచం ముందు తలెత్తుకుని ఉంటుందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: