సాధారణంగా అర్ధరాత్రి సమయంలో ఎవరైనా ఊరి పొలిమేరలకు వెళ్లాలంటేనే భయపడుతు ఉంటారు.  ఏదైనా అత్యవసరమైన పని ఉన్నప్పుడు మాత్రమే ఊరి పొలిమేరలకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  రాత్రి సమయంలో బయటికి వెళ్లడానికి భయపడి  కొన్ని కొన్ని సార్లు పని వాయిదా వేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ గ్రామంలో కొంత మంది జనాలు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఊరు పొలిమేరలకు వెళ్లడం స్టార్ట్ చేశారు. కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు తరచూ ఇలా ఊరి పొలిమేరలకు వెళుతూ వస్తున్నారు కొంత మంది వ్యక్తులు. అయితే ఇక ఇలా వెళ్లి వస్తూ ఉండడాన్ని ఊర్లో జనాలు గమనించారు. వాళ్లు అలా అర్ధరాత్రి ఎందుకు వెళ్లి వస్తున్నారు అన్నది మాత్రం అర్థం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఓరోజు నిఘా పెట్టి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాకయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సమీపంలోని బుర్రిలంక ఆదియ్య రోడ్డు లో ఒక ఖాళీ స్థలం  ఉంది. అక్కడ 17 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు పోలీసులు  వారి దగ్గర్నుంచి 2.15 లక్షలు నగదు 18 మొబైల్స్ తో పాటు ఇరవై మూడు బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వస్తుండటాన్ని గమనించి 6 గురు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక మరో 23 మంది పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు  ఇందులో పట్టాభి అనే వ్యక్తి పేకాట శిబిరం నిర్వాహకుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు  కొద్దిరోజులుగా గ్రామం నుంచి ఎంతోమంది అర్ధరాత్రి సమయంలో గ్రామ పొలిమేరలకు వస్తున్నారని.  ఇది గమనించిన గ్రామస్తులు తమకు సమాచారం అందించారు అంటూ పోలీసులు తెలిపారు  ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లి చూసేసరికి పేకాట స్థావరాలలో భారీగా పేకాట ఆడుతున్నారని గుర్తించామని వెంటనే నిందితులను అరెస్టు చేశామని తెలిపారు  అయితే పేకాట కోడిపందాల ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. అయితే ఇలా అర్ధరాత్రి సమయంలో పేకాటరాయుళ్లు చేస్తున్న పని వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: