ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించాలి అంటే పెద్ద పెద్ద చదువులు చదివి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి అని అనుకునేవారు. లేదా తమ దగ్గర ఉన్న డబ్బుతో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలి అనుకునేవారు.  ఇదంతా చేయాలి అంటే కనీసం పాతికేళ్ళ వయసు అయినా వచ్చి ఉండాలి.  కానీ ఒక్క ఏడాది వాయిస్తున్న బాలుడు డబ్బు సంపాదిస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా..  మీరే కాదు ఎవ్వరు కూడా నమ్మరు. ఎందుకంటే అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ.. అమ్మానాన్న చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాడు ఒక ఏడాది వయసున్న పిల్లాడు. అమ్మ నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటే ఇక అమ్మ చాటు బిడ్డలా..  తిరుగుతూ ఉంటాడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే తింటూ హాయిగా నిద్ర పోతూ ఉంటాడు.  ఇదే ఒక ఏడాది వయసున్న చిన్నారి బాలుడు చేసే పని అన్నది అందరికి తెలిసిందే.  కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది..  పరిస్థితులు మారిపోయాయి..  డబ్బు సంపాదించాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన పని లేదు. కాస్త టెక్నిక్ తెలిస్తే సరిపోతుంది నేటి రోజుల్లో. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో యూట్యూబ్ వేదికగా ఎంతోమంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏడాది వయసున్న చిన్నారి బాలుడు కూడా ఏకంగా ఏడాది వయసులోనే ఉద్యోగం చేస్తున్నాడు. అంతే కాదు నెలకు 75 వేల రూపాయల సంపాదిస్తున్నాడు  షాక్ అవుతున్నారు కదా. కానీ ఇది నిజమే ఆ చిన్నారి చేసే పని ఏంటంటే వివిధ ప్రాంతాల్లో పర్యటించడమే. అమెరికాకు చెందిన బేబీ బ్రిక్స్ అనే ఒక ఏడాది వయసున్న చిన్నోడు ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేశాడు. ఆ దేశంలోని 16 రాష్ట్రాల్లో చుట్టి వచ్చాడు.  అలస్కా,కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రంలోని పార్కులు, బీచ్లు లో తిరుగుతూ ఉంటాడు. మరి అతనికి డబ్బులు ఎలా వస్తాయి అంటారా.. ఇక ఆ చిన్నారి వివిధ పర్యాటక ప్రాంతాలలో తిరుగుతూ ఉంటే అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో చేర్చడమే బ్రిక్స్ తల్లి పని. దీనికి డబ్బులు కూడా చెల్లిస్తారు. నెలకు 75 వేల రూపాయలకు పైగానే ఇలా ఈ బుడ్డోడు ఆదాయం సంపాదిస్తున్నాడు. అంతేకాదండోయ్ ఈ ఏడాది చిన్నోడికి ఇంస్టాగ్రామ్ లో 35 వేల మందికి పైగా ఫాలోవర్లు కూడా ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: