ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అధికార పార్టీలో మునుపు ఎన్న‌డూ లేని దూకు డు క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌లోనూ గ‌తంలో లేని స్పంద‌న‌(రియాక్ష‌న్‌) స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలను గ‌మ‌నిస్తున్న వారు.. దీనివెనుక రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్ ఉన్నాడ‌నే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎందుకంటే.. దీనికి రెండు రీజ‌న్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ స్పంద‌న అనూహ్యంగా ఉంది. గ‌తంలో త‌న‌ను ఎవరు ఎన్ని అన్నా.. పెద్ద‌గా రియాక్ట్ కాలేదు. అంతెందుకు.. నెల రోజుల కింద‌ట‌.. మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు స్వ‌యంగా బ‌హిరంగ వేదిక‌పై నాకొడ‌క‌.. అంటూ ప‌దే ప‌దే సంభోదించారు.

ఏం పీకుతావో పీక్కో! అంటూ.. వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఆయ‌న గురించి జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌మా టంటే .. ఒక్క మాట కూడా అన‌లేదు. అయితే.. అదేస‌మ‌యంలో పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌.. మాత్రం చంద్ర‌బాబు ఇంటిపైకి వెళ్లార‌నేది తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో.. పీకే.. జ‌గ‌న్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో స‌ర్వేపై వారు చ‌ర్చించార‌నితెలిసింది. ఈ క్ర‌మంలోనే పార్టీ దూకుడు పెంచాల‌ని పీకే జ‌గ‌న్‌కు స్పష్టంగా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. దీనిని బ‌ట్టే.. తాజాగా ప‌ట్టాభి విష‌యంలో జ‌గ‌న్ దూకుడు పెంచార‌ని అంటున్నారు. ఆయ‌నే స్వ‌యంగా వ‌రుస‌గా రెండు రోజులు ఈ విష‌యాన్ని ప్ర‌స్థావించారు. తొలిరోజు.. ప్ర‌భుత్వం ప్రారంభించిన జ‌గ‌న‌న్న తోడు కార్య‌క్ర‌మంలో స్పందించారు.

రెండోరోజు.. పోలీసుల అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ స‌భ‌లోనూ ఆయ‌న ప‌ట్టాభి విష‌యాన్ని ప్ర‌ధానంగా మాట్లాడారు. ఈ క్ర‌మంలో తాము ఇక ఊరుకునేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మొత్తం ప‌రిణామాల వెనుక‌.. పీకే ఉన్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. ఎందుకంటే.. టీడీపీ పుంజుకుంటున్న ప‌రిస్థితి ఇటీవ‌ల కాలంలో క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ .. చంద్ర‌బాబు క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో వైసీపీ విష‌యంలో ప్ర‌జ‌ల్లో డైల్యూట్ కాకుండా ఉండాలంటే.. ఎక్క‌డిక‌క్క‌డ ఎప్ప‌టిక‌ప్పుడు.. స్పందించ‌డంతోపాటు.. టీడీపీని నిలువ‌రించాల‌నేది పీకే సూత్రంగా చెబుతున్నారు. అదికారంలో ఉండి..ప్ర‌తిప‌క్షం అనే మాట‌ల‌కు త‌లొగ్గితే.. ప్ర‌జ‌ల్లో ఇదే నిజ‌మ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతుంద‌ని.. ఇది మొద‌టికే మోసం చేస్తుంద‌ని.. పీకే చెప్పిన‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఇప్పుడు వెంట‌నే స్పందించార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: