వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అనకాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్‌.. రాజ‌కీయాన్ని వేడెక్కిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీ నేత‌ల‌పై స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు రువ్వుతున్నారు. దీంతో వైసీపీలో బూమ్ పెరిగింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో అమ‌ర్నాథ్ దూకుడుగానే ఉంటున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా పేరున్న ఆయ‌న మంత్రి వ‌ర్గం రేసులోనూ ఉండ‌డంతో.. ఆయ‌న దూకుడు మ‌రింత పెంచార‌ని.. అనుచ‌రులు చెబుతున్నారు. పైకి కూడా ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

నిజానికి అన‌కాప‌ల్లిలో వైసీపీ గెలుపు ఇదే తొలిసారి. టీడీపీకి కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ త‌ర‌ఫున దాడి వీర‌భ‌ద్ర‌రావు.. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని.. పార్టీకి పునాదులు వేశారు. ఇక‌, త‌ర్వాత‌.. గంటా శ్రీనివాస‌రావు.. కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్యంగా అమ‌ర్నాథ్ విజ‌యం సాధించారు. వార‌స‌త్వంగా వ‌చ్చిన నాయ‌కుడు కావ‌డం.. అనుచ‌ర గ‌ణం ఎక్కువ‌గా ఉండ‌డం.. పార్టీలో నేరుగా అధిష్టానంతోనే చ‌నువు ఉండ‌డంతో అమ‌ర్నాథ్ దూకుడు ఎక్కువ‌గానే ఉంది. అయితే.. నియోజ క‌వ‌ర్గంలో కామెంట్లు చేయ‌డం.. ప్ర‌త్య‌ర్థిపార్టీల‌పై విమ్శ‌లు చేయ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. అభివృద్ధి లేద‌నే  విమర్శ‌లు వినిపిస్తున్నాయి.

పైగా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంతో సంబంధం లేని విష‌యాల్లోనూ.. టీడీపీ మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడితో నూ.. అమర్నాథ్ సై అంటే సై అని దూకుడుగా వెళ్తున్నారు. ఇటీవ‌ల కాలంలో అయ్య‌న్న‌తో నువ్వెంత అంటే.. నువ్వెంత అనే రేంజ్‌లో వివాదాల‌కు దిగుతున్నారు. ఈ దూకుడు చూస్తే.. త‌న‌కు తిరుగులేదు.. అనే రేంజ్‌లో సంకేతాలు ఇస్తున్నార‌నే వాద‌న ఉంది. అయితే.. అదేస‌మ‌యంలో టీడీపీకి కంచుకోట వంటి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ ఆ పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని.. ఏమాత్రం అభివృద్ధి వైపు మొగ్గు చూప‌కుండా.. కేవ‌లం దూకుడునే న‌మ్ముకుంటే.. ప్ర‌మాద‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, ప్ర‌స్తుతం మంత్రివ‌ర్గం రేసులో ఉన్న‌వారిలో అమ‌ర్నాథ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఆయ‌న అభిమానులు కూడా సూచిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది క‌దా.. అనుకుంటే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. చెబుతున్నారు. ఇప్ప‌టికైనా.. కొంత ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తే.. వార‌స‌త్వంగా వ‌చ్చిన మంచిని నిల‌బెట్టుకునే ఛాన్స్ ఉంటుంద‌ని చెబుతున్నారు. పైగా ఆయ‌న స్థానికంగా ఉండ‌డం లేద‌నే వాద‌న కూడా ఉంది. సో.. ఈ ప‌రిణామాల‌ను బేరీజు వేసుకుని ముందుకు సాగితే..బెట‌ర్ అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: