ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ విజయం సాధించాక తీసుకున్న ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో అమ‌రావ‌తిని వికేంద్రీక‌రిస్తూ మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యం ముఖ్య‌మైంది. అయితే గ‌త రెండున్నర సంవ‌త్స‌రాలుగా రాజ‌ధాని ని మార్చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ న్యాయ ప‌ర‌మైన చిక్కుల వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రాజ‌ధాని త‌ర‌లింపు ప్ర‌క్రియ అంశం ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఏకంగా రెండు ఉగాదిలు, రెండు దసరా లు వెళ్లాయి. ప్ర‌తి పండ‌గ కు జ‌గ‌న్ రాజ‌ధాని త‌ర‌లింపు ఎలా ?  ఉన్నా కూడా క‌నీసం ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్‌గా ఉన్న విశాఖ‌కు త‌న క్యాంప్ ఆఫీస్ అయినా త‌ర‌లించేస్తార‌ని గొప్ప‌లు చెప్పుకుంటూ వ‌స్తున్నారు.

అయితే జ‌గ‌న్ గత రెండున్నరేళ్లుగా తాడేపల్లి క్యాంప కార్యాలయం నుంచే తన కార్యకలాపాలను కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. సచివాలయానికి మంత్రివర్గ సమావేశాలు ఉంటే నే వెళుతున్నారు. ఇక ఏవైనా ప‌థ‌కాలు, ల‌బ్ధిదారుల‌కు నగ‌దు విడుద‌ల కార్య‌క్ర‌మాలు ఉంటే ఆయ‌న క్యాంప్ కార్యాల‌యం నుంచే బ‌ట‌న్ నొక్కి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక పై మాత్రం ఆయ‌న త‌న క్యాంప్ కార్యాల‌యాన్ని విశాఖ‌కు మార్చేస్తార‌ని తెలుస్తోంది. అక్క‌డ నుంచి ముఖ్య‌మంత్రి హోదాలో త‌న కార్య‌క‌లాపాలు అన్ని న‌డిపించే స్తార‌ని అంటున్నారు.

అస‌లు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జ‌గ‌న్ క్యాంప్ ఆఫీస్ అక్క‌డ‌కు మారుస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. బీచ్ రోడ్డులో ఓ భ‌వ‌నం కూడా చూశార‌ని అన్నారు. అప్ప‌ట్లోనే సీఎంవోలో ఉన్న ప్ర‌వీణ్ ప్రకాష్ తో పాటు డీజీపీ గౌతం సవాంగ్ సైతం విశాఖ‌ను సంద‌ర్శించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క్యాంప్ కార్యాల‌యం త‌ర‌లింపు జ‌ర‌గ‌లేదు. అయితే ఈ సారి మాత్రం అలా వాయిదాలు లేకుండా సంక్రాంతి వెళ్లిన త‌ర్వాతే క్యాంప్ ఆఫీస్ ను మాత్రం ముందుగా మార్చేసే ప్ర‌క్రియ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: