ఈ రోజు చాలా మంది ప్రజలు భారతదేశ కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తున్నారు అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. శుక్ర‌వారం జాతినుద్దేశించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించారు. భారతదేశం 100 కోట్ల కరోనా టీకా మార్కును దాటిన వేగం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించార‌న్నారు. కరోనా మహమ్మారి ప్రారంభంలో, భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో ఈ మహమ్మారిపై పోరాడటం చాలా కష్టమనే భయాలు వ్యక్తమయ్యాయి అని తెలిపారు. ఇంత సంయమనం, అంత క్రమశిక్షణ ఇక్కడ ఎలా పని చేస్తాయనేది ఈ టీకా కార్యక్రమం ద్వారా భారతదేశ ప్రజలకు తెలిసింది అని పేర్కొన్నారు.


భారతదేశ మొత్తం టీకా కార్యక్రమం విజ్ఞాన గర్భంలో పుట్టింది, శాస్త్రీయ ప్రాతిపదికన పెరిగింది మరియు శాస్త్రీయ పద్ధతుల ద్వారా నాలుగు దిశలకు చేరుకుంది అని అన్నారు. భారతదేశం యొక్క మొత్తం టీకా కార్యక్రమం సైన్స్ బోర్న్, సైన్స్ డ్రైవెన్ మరియు సైన్స్ బేస్డ్ కావడం మనందరికీ గర్వకారణం తెలిపారు. దేశంలో  'అందరికీ టీకా ,  నగదు రహిత వ్యాక్సిన్' అనే ప్రచారాన్ని ప్రారంభించింది, వాక్సిన్ పంపిణీలో పేద-ధనిక, గ్రామం-నగరం, సుదూర అనే తేడా లేకుండా దేశంలో ఒకే ఒక మంత్రం ఉంది. టీకాలో పంపిణీలో ఎలాంటి వివక్ష ఉండదు పున‌రుద్ఘాటించారు.


టీకా ప్రచారంలో VIP సంస్కృతి ఆధిపత్యం చెలాయించలేదని చెప్పారు. దేశ, విదేశాల నుంచి నిపుణులు మరియు అనేక ఏజెన్సీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా సానుకూలంగా ఉన్నాయ‌ని, నేడు భారతీయ కంపెనీలలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం మాత్రమే కాదు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా వ‌స్తున్నాయ‌న్నారు. స్టార్టప్‌లలో రికార్డు స్థాయిలో పెట్టుబడి, రికార్డ్ స్టార్టప్‌లు, యునికార్న్‌లు తయారు చేయబడుతున్నాయ‌న్నారు.


స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రజా ఉద్యమం లాగా, భారతదేశంలో తయారైన వస్తువులను కొనడం, స్థానికంగా భారతీయులు తయారు చేసిన వస్తువులను కొనడాన్ని ఆచరణలో పెట్టాలి అని కోరారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా భారతీయుడు చెమటోడ్చి తయారు చేసిన చిన్న వస్తువును కొనుగోలు చేయాలని  నేను దేశ ప్రజలను కోరుతున్నాను. ఇది అందరి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యమవుతుంది అని విజ్ఞ‌ప్తి చేశారు.  మన పండుగలను అత్యంత శ్రద్ధతో జరుపుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: