తెలంగాణ అంత‌టా సీ ఓట‌ర్ స‌ర్వే సంచ‌ల‌నంగా మారింది. 115 అంశాల‌పై చేసిన స‌ర్వే ఆధారంగా చూస్తే సీఎం కేసీఆర్ ను 80 శాతం మంది తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని తేలింది. బెస్ట్ సీఎంగా చ‌త్తీస్‌ఘ‌డ్ ముఖ్య‌మంత్రి భేపేశ్ భ‌గేల్ మొద‌టి స్థానంలో నిలిచారు. కేసీఆర్ వైపు చూస్తే ప్ర‌జాగ్ర‌హంలో నెం1 గా, ప‌రిపాల‌న‌లో చిట్ట చివ‌ర‌గా నిలిచారు. ఈ స‌ర్వేలో సీఎం కేసీఆర్ వెనుక‌బ‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు చూస్తే.. రాష్ట్ర అవ‌త‌ర‌ణ త‌రువాత అంతా వాస్తు ప్ర‌కారమే జ‌ర‌గాల‌ని నిర్ణ‌యించుకుని ముందు సెక్ర‌టెరియేట్‌కు వెళ్ల‌డం మానేశారు. దీంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కూర్చుని అక్క‌డి నుంచే ప‌రిపాల‌న మొద‌లు పెట్టారు.


  ప్ర‌భుత్వ స‌చివాల‌యం ఉండ‌గా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ఊప‌యోగించ‌డం తీవ్ర దుమారం రేపింది. అయినా కేసీఆర్ లెక్క చేయ‌కుండా అధికార, అనాధికార‌, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, మంత్రుల స‌మావేశాలు అక్క‌డే నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఆయ‌న నియంత పాల‌నపై ప‌లు సంద‌ర్భాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీనికి తోడు ఆయ‌న ఫాం హౌజ్ కూడా వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది. దీంతో ప్ర‌గ‌తిభ‌వ‌న్, ఫాంహౌజ్ పాల‌న‌తో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు కార‌ణంగా చెబుతున్నారు.

 అలాగే, రాష్ట్రంలో అవినీతి పాల‌న కొన‌సాగుతుంద‌నే ఆరోప‌ణ‌లు. క‌బ్జాలు, కాంట్రాక్టులు, ప్ర‌జాసొమ్ము దుర్వినియోగం ఇలా అన్నింటా అవినీతి బుస‌లు కొడుతుంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. అలాగే, ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌స్తే అక్క‌డ లెక్క‌కుమించి నిధులు కుమ్మ‌రించడం అంద‌రికీ తెలిసిందే, ఈ క్ర‌మంలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం ఒక కార‌ణంగా చెబుతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఎక్క‌డా కూడా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం క‌ష్టంగా మారితే సంక్షేమ ప‌థ‌కాలకు నిధులు ఎలా వ‌స్తాయ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


   సీఎం కేసీఆర్ అబ‌ద్దాలు ఆడుతార‌నే ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం. ఇక్క‌డ ఒక మాట అని నేను అన‌లేదు అని చెప్పిన సంద‌ర్భాలు చాలానే క‌నిపిస్తాయి. ప్ర‌తిప‌క్షాలు మాత్రం కేసీఆర్ మాట‌ల కోత‌లు, ప‌చ్చి అబ‌ద్దాల కోరు అంటూ తీవ్ర స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. ఆయ‌న ఇచ్చిన హామీలే ఇప్పుడు ఆయ‌న కొంప ముంచాయ‌ని తెలుస్తోంది. ఇవ‌న్ని వెర‌సి కేసీఆర్‌పై ప్ర‌జాగ్ర‌హం పెరిగింద‌ని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: