తూర్పు గోదావరి జిల్లా : ఏపీ సర్కార్‌ పై మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్  షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దేశ పరిస్థితులు చాలా అద్వాన్నంగా ఉన్నాయి.ప్రధాన మంత్రి అబద్దాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు చింతా మోహన్‌. దేశ సరిహద్దుల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి.శత్రువులు పొంచి ఉన్నారు.దేశ భక్తులు అందరూ జాగరూతతో ఉండాలని పేర్కొన్నారు చింతా మోహన్‌. చైనా చొరబాటుదారులు ఎన్ని కిలోమీటర్లు ముందుకు వచ్చారో ప్రధాని స్పష్టం చేయాలని... పంచవర్ష ప్రణాళికలతో ఆనాటి ప్రధాని నెహ్రూ చేసిన అభివృద్ధి తప్ప మీరు ఏం చేశారు ? స్పష్టం చేశారు చింతా మోహన్‌. 

గుజరాత్ పోర్ట్ లో 20 వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుకుంటే అది మీకు కనపడదా ? అని ప్రశ్నించారు చింతా మోహన్‌. "ఇండియా ఫర్ సేల్" మీరు చేసింది ఇదేనని... అమెరికా తరహాలో ఇండియా కెపిలిస్ట్ విధానంలో పోతుందని నిప్పులు చెరిగారు చింతా మోహన్‌. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదు.ఆకలి ఎక్కువగా ఉందని... మేధావులందరూ మౌనంగా ఉంటే దేశానికే ప్రమాదమన్నారు.  ఏపీలో వైసీపీ, ప్రతిపక్షం పూర్తిగా విఫలం. సంస్కృతి, ఆత్మ గౌరవం అన్నవే లేవు.అధికార దాహం తప్ప అని చురకలు అంటించారు చింతా మోహన్‌.

రాష్ట్రంలో 80 లక్షల మంది ఎస్సి, ఎస్టీ,ఓబీసీ,మైనార్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్,మెస్ బిల్లులు,ఫీజ్ రీ ఎంబర్స్మెంట్ లు 2 సం ల నుండి చెల్లించలేదు.వెంటనే చెల్లించాలి. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయని అని నిలదీశారు చింతా మోహన్‌.. ఏపీ రా ష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే చెల్లించాల ని డిమాండ్ చేస్తున్నానని... పంజాబ్ లో ఒక ఎస్సిని ముఖ్యమంత్రి ని చేసిన ఘన త కాంగ్రెస్ దే నని కొని యాడారు చింతా మోహన్‌. ఒక కాపు ని ఏపీ ముఖ్యమంత్రిని చేయాలని నేను భావిస్తున్నానని...పార్టీ పెద్దలతో మాట్లాడతానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: