తెలంగాణ లో అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ట్రైనీ ఐఏఎస్ ఆఫీస‌ర్ కొడుకు లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌ల్లో చిక్కుకున్నారు. ఇందులో వాస్త‌వం ఎంత అన్న‌ది విచార‌ణ త‌ర్వాతే తేల‌నుంది. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న వ్య‌క్తి అటు అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకు కొడుకు మాత్ర‌మే కాదు.. ఇటు ఓ యంగ్ ఐఏఎస్ ట్రైనీ ఆఫీస‌ర్ కూడా..! ఖ‌మ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మ‌ద‌న్ లాల్ కుమారుడు అయిన బానోతు మృగేంద‌ర్ లాల్ ఐఏఎస్ కు ఎంపికై త‌మిళ‌నాడులో ని మ‌ధురైలో శిక్ష‌ణ పొందుతున్నారు.

అయితే మృగేంద‌ర్ లాల్ పై ఓ యువ‌తి లైంగిక వేధింపుల కేసును పెట్టారు. మృగేంద‌ర్ పెళ్లి చేసుకుంటాన‌ని త‌న‌ను న‌మ్మించి మోసం చేశాడంటూ ఆమె కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు లో వివ‌రాల‌ను బ‌ట్టి చూస్తే అప్పుడు సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న స‌మ‌యంలో మృగేంద‌ర్ త‌న‌కు ఫేస్ బుక్ ద్వారా ప‌రిచ‌యం అయ్యాడ‌ని ఆ త‌ర్వాత తాము స్నేహితులం అయ్యామ‌ని.. త‌న త‌ల్లి దండ్రుల‌ను ఒప్పించి బ‌య‌ట‌కు తీసుకు వెళ్లి మ‌రీ త‌న పుట్టిన రోజు వేడుక‌లు చేశాడ‌ని ఆమె పేర్కొన్నారు.

ఆ త‌ర్వాత త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి శారీర‌కంగా కూడా లోబ‌రు చు కున్నాడంటూ ఆమె పేర్కొన్నారు. అత‌డి తండ్రి కూడా వైరా మాజీ ఎమ్మెల్యే అని చెప్పారు. ఆ త‌ర్వాత అత‌డు త‌న త‌ల్లి ని, తండ్రిని కూడా బెదిరించిన‌ట్టు ఆమె చెపుతున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే మ‌ద‌న్ లాల్‌ను వివ‌ర‌ణ కోరితే ఆ యువ‌తి త‌మ‌కు స‌మీప బంధువే అవుతుంద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ కేసు గురించి త‌మ‌కు తెలియ‌ద‌ని కూడా ఆయ‌న చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TRS