ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు హాట్‌హాట్‌గా మారాయి. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య‌ మాట‌ల తూటాలు పేలుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ యుద్ధంలో గెల‌వడానికి సీఎం జ‌గ‌న్ అస్త్రాలు సిద్ధం చేశారు. కొన్ని రోజుల క్రితం మంత్రివ‌ర్గ స‌మావేశంలో వ‌చ్చే ఏడాది నుంచి పీకే రంగంలోకి వ‌స్తుంద‌ని పార్టీ కోసం ప‌ని చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో సీఎం జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం సిద్ధం అవుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి త‌రువాత జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌శాంత్ కిషోర్ బిజిగా క‌నిపిస్తున్నారు.


 శ‌ర‌ద్ ప‌వార్‌తో క‌లిసి జాతీయ పార్టీల కూట‌మి ఏర్పాటు దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ప్ర‌శాంత్ కిషోర్‌కు ఆహ్వానం అందింది. సోనియాతోనూ చ‌ర్చించారు. అయితే, పీకే పార్టీలో చేరిక‌పైన ముఖ్య‌నేతల్లో భిన్నాభిప్రాయం నెల‌కొంది. దీంతో పీకే కాంగ్రెస్‌లో చేరాల‌నుకున్న నిర్ణ‌యం ఉప సంహ‌రించుకున్న‌ట్టు తెలుస్తోంది.  బెంగాల్ ఎన్నిక‌ల త‌రువాత రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేయ‌న‌ని ప్ర‌క‌టించారు పీకే. కానీ మారిన ప‌రిస్థితుల్లో తిరిగి ఐపాక్ వ్యూహాలకు ముందుకు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.


 అయితే, ఏపీలో వైసీపీ కి మాత్రం ప‌ని చేయ‌డానికి స్వ‌యంగా పీకే రంగంలోకి వ‌స్తున్న‌ట్టు పార్టీ నేత‌లు చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో పీకే వైసీపీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు స‌మీక‌ర‌ణాలు, ప్ర‌చార తీరు పైన సూచ‌న‌లు చేసేవారు. ఇప్పుడు, పీకేకు చెందిన ఐప్యాక్ టీం వైసీపీ కోసం ప‌ని చేస్తోంది. పార్టీ ప‌నితీరుపై క్షేత్ర స్థాయ‌లో ప‌ని చేస్తుంద‌ని స‌మాచారం. రెండు పార్టీల భ‌విష్య‌త్ ఈ ఎన్నిక‌పైనే ఆధార‌డ్డాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక కోసం జ‌గ‌న్ ముందుగానే సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగానే పీకే టీం గురించి సంకేతాలిచ్చేశారు. న‌వంబ‌ర్‌లో పీకేతో సీఎం జ‌గ‌న్ స‌మావేశం అవుతార‌ని స‌మ‌చారం. క్యాబినెట్ విస్త‌ర‌ణ ప‌నులు చేస్తూనే.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. 2024 టార్గెట్‌లో భాగంగా ఈ నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: