సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న టీడీపీ కి క‌ష్ట కాలం వ‌చ్చేలానే ఉంది. ముఖ్య‌మంత్రి పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కార‌ణంగా ప‌ట్టాభిని అరెస్టు చేయించింది వైసీపీ ప్ర‌భుత్వం. ఇంకా ఇంకొంద‌రిని కూడా అరెస్టు చేయించాల‌ని యోచిస్తోంది. ఈ త‌రుణంలో ఢిల్లీ కేంద్రంగా రాజ‌కీ యం మ‌రింత ర‌క్తి క‌ట్ట‌నుంది. 36 గంట‌ల నిర‌స‌న త‌రువాత ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నారు బాబు. ఇక్క‌డ నెల‌కొన్న ప‌రిణామా లపై కేంద్రానికి వివ‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీనీ, హోం మంత్రి అమిత్ షానూ క‌ల‌వ‌నున్నారు. ఇదే స‌మ‌యం లో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ క‌ల‌వాల‌ని వైసీపీ అనుకుంటోంది. టీడీపీ గుర్తింపును రద్దు చేయాల‌ని ప‌ట్టుబట్ట‌నుంది. ఈ మేర‌కు ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. దీంతో రాష్ట్రం త‌గాదా కాస్త ఢిల్లీకి చేరింది. మ రి! టీడీపీ గుర్తింపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం రద్దు చేస్తుందా? అందుకు త‌గ్గ కార‌ణాలు వైసీపీ ఏమ‌ని చెప్పి ఒప్పించ‌గ‌ల‌దు?

ఢిల్లీలో బాబు మాట నెగ్గేనా?
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంపై దాడులు చేసిన జ‌గ‌న్ అభిమానులెవ్వ‌రినీ డీజీపీ అరెస్టు చేయ‌లేక‌పోయార‌ని టీడీపీ మం డి పడుతోంది. ఇదే సంద‌ర్భంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కూడా కోరుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ఆర్టిక‌ల్ 356ను ఇంపోజ్ చేయ‌డం సాధ్యం కాద‌ని తేలిపోయింది. అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే రాష్ట్ర‌ప‌తి పాల‌న ఉండ‌నుంది. ఇక ఢిల్లీ కేం ద్రంగా లాబీయింగ్ న‌డిపేందుకు అక్క‌డికి బాబు వెళ్ల‌నున్నారు. పూర్వ స్నేహాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. ఈ ద‌శ‌లో మోడీ మాత్రం బాబుపై ప్రేమ చూపిస్తార‌ని అనుకునేందుకు వీల్లేద‌ని తేలిపోయింది. గ‌తంలో ప‌రిణామాలు ఎలా ఉన్నా మోడీ త‌నదైన పంథాలో బాబుతో మాట్లాడి పంపిస్తార‌ని అంతకుమించి పెద్ద‌గా మార్పు ఏమీ ఉండ‌ద‌ని కూడా తెలుస్తోంది. ప్ర‌స్తు తం మోడీ చూపు అంతా జ‌గ‌న్ వైపే ఉంది క‌నుక చంద్ర‌బాబుకు అండ‌గా ఆయ‌న ఉండ‌ర‌ని, అపాయింట్మెంట్ వ‌ర‌కూ ఏ ఇబ్బందీ తలెత్త‌క‌పోయినా భేటీ త‌రువాత చంద్ర‌బాబుకు అనుకూలంగా బీజేపీ బాస్ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వ‌ర‌ని నిర్థార‌ణ అవుతోంది.మరింత సమాచారం తెలుసుకోండి: