ప్ర‌స్తుత వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ వివాదంలో టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ గ్రాఫ్ పెరిగిం దా? ఆయ‌న దూకుడు మ‌రింత పుంజుకుందా? అంటే.. ఔన‌నీ కాద‌ని చెప్ప‌లేని సందిగ్ధంలో ఉన్నా రు టీడీపీ నాయ‌కులు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు త‌ర్వాత‌..నెంబర్ 2గా పిలుచుకునే లోకే ష్‌ను దీక్ష‌లో కూర్చోబెట్టేందుకు చంద్ర‌బాబు ముందుకు రాలేదు. నిజానికి పార్టీ కేంద్ర కార్యాల‌యంపై దా డి జ‌రిగిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు దీక్ష నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ, అనూహ్యం గా ఆయ‌న దీక్ష ప్ర‌క‌ట‌న చేశారు. దీనిలో భాగంగా ఆయ‌న 36 గంట‌ల దీక్ష‌కు కూర్చున్నారు.

కానీ.. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌నతోపాటు.. త‌న కుమారుడు భావి పార్టీ అధ్య‌క్షుడు నారా లోకేష్‌ను కూడా కూర్చోబెట్టుకుని ఉంటే ప‌రిస్థితి వేరేగా ఉండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తు తం చంద్ర‌బాబు దీక్ష చేసినా.. ఆయ‌న వృద్ధుడు.. ఈ వ‌య‌సులో ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా? అనే మాట వినిపి స్తోంది. అదే స‌మ‌యంలో లోకేష్ ను ఎందుకు దీక్ష‌కు కూర్చోబెట్ట‌లేదు..? అనే గుస‌గుస కూడా వినిపిస్తోం ది. దీనికి కార‌ణాలు ఏవైనా కానీ.. లోకేష్ నాయ‌క‌త్వంపై మాత్రం ప్ర‌భావం ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల కులు.

ఎందుకంటే.. లోకేష్‌కు చాలా ఫ్యూచ‌ర్ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెల‌వాలి. అప్పుడే.. పార్టీలో పున‌ర్వైభ‌వం సాధ్య‌మ‌వుతుంది. పైగా.. చంద్ర‌బాబు ను మించిన నాయకుడు అనే పేరు వ‌స్తే.. త‌ప్ప‌.. లోకేష్ టీడీపీని న‌డిపించే ప‌రిస్థితి ఉండ‌దు. ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే.. బ‌ల‌మైన కార్య‌క్ర‌మం చేప‌డితే త‌ప్ప‌.. లోకేష్‌కు సాధ్యం కాదు. ఆ బ‌ల‌మైన అవ‌కాశం ఇప్పుడు వ‌చ్చిన దానిక‌న్నా.. మించి మ‌రొక‌టి లేదు. సో.. లోకేష్‌కు ఇది ఇప్పుడు గోల్డెన్ అవ‌ర్‌గానే భావిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దీక్ష‌లో పాల్గొన‌లేదు.

కేవ‌లం చంద్ర‌బాబు మాత్ర‌మే దీక్ష చేస్తున్నారు. ఇది మైన‌స్ కాదా? అనేది టీడీపీ అభిమానుల ప్ర‌శ్న. చంద్ర‌బాబు కూర్చున్నా.. త‌ప్పులేక‌పోయినా.. లోకేష్ దీక్ష చేసి ఉంటే.. ఆ రిజ‌ల్ట్ వేరేగా ఉండేద‌ని.. యువ‌త నేత‌లు క‌లిసి వ‌చ్చేందుకు పార్టీని బ‌లోపేతం చేసేందుకు ముఖ్యంగా అధికార పార్టీ దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు అవ‌కాశం ఉండేద‌ని చెబుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: