ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల ర‌ద్దు అంశం హై కోర్టుకు చేరిన‌ది. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రుల సంఘం గురువారం పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఇంటర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు అక్టోబ‌ర్ 25 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మైంది ఇంట‌ర్ బోర్డు. దీనిపై విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం అవుతున్నారు. త‌ల్లిదండ్రుల సంఘం త‌రుపున  హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు న్యాయ‌వాది రాపోలు భాస్క‌ర్. ప్ర‌మోట్ అయిన విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించొద్ద‌ని కోరారు పిటిష‌న‌ర్‌.
 
ఇది ఇలా ఉండ‌గా శుక్ర‌వారం ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని లంచ్  మోష‌న్  పిటిష‌న్ వేసింది. హైకోర్టు లంచ్ మోష‌న్ పిటిష‌న్ విచార‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది. త‌ల్లిదండ్రుల సంఘం హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి విద్యార్థులంద‌రినీ పాస్ చేయాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. ఇది ఇలా ఉండ‌గా ఇటీవ‌ల మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు 25 నుంచి జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే మెటీరియ‌ల్ అంద‌జేశాం. విద్యార్థులు చ‌దువుకొని ప‌రీక్షలు రాయాల‌ని సూచించారు.

లంచ్ మోష‌న్ పిటిష‌న్ స్వీక‌రించిన తెలంగాణ హైకోర్టు కీల‌క తీర్పును ఇచ్చింది. ఇప్పుడు ప‌రీక్ష‌ల‌ను ఆప‌మ‌నడం స‌మంజ‌సం కాదు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో కోర్టు జోక్యం చేసుకోదు. పిటిష‌న్ ఆల‌స్యంగా ఇచ్చార‌ని వ్యాఖ్యానించింది. ఇచ్చిన పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని సూచించింది. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసే అధికారం లేద‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు.  అక్టోబ‌ర్ 25న ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయ‌ని తెలిపింది. క‌రోనా నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు మార్చిలో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌లేదు. మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థుల‌ను  ఇప్ప‌టికే  రెండ‌వ‌సంవ‌త్స‌రానికి ప్ర‌మోట్ చేసింది. వారికి మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 3 వ‌ర‌కు నిర్వ‌హించ‌నుండి ఇంట‌ర్ బోర్డు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4ల‌క్ష‌ల 52వేల మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. త‌ల్లిదండ్రుల సంఘం లంచ్‌మోష‌న్ పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోర్టు సూచించింది. దీంతో ఆ సంఘం ఉప‌సంహ‌రించుకుంది.




.

మరింత సమాచారం తెలుసుకోండి: