ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతుంది. ఇప్ప‌టికే మ‌ధ్య ప్ర‌దేశ్, పంజాబ్ తో ప‌టు ప‌లు రాష్ట్రాల‌లో త‌మ పార్టీ నాయ‌కులు ఇత‌ర పార్టీలకు మారుతున్నారు. వారిని కాపాడు కొవ‌డానికి ఆ పార్టీ అధిష్టానం తీవ్రం గా క‌ష్ట ప‌డుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మ‌రో త‌ల నొప్పి ముందుకు వ‌చ్చింది. ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ త‌గిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ ప్ర‌దీప్ మాఝీ రాజీనామా చేశారు. ఆయ‌న ఇది వ‌ర‌కు కాంగ్రెస్ నుంచి ఎంపీ గా పోటీ చేసి గెలిచాడు. అయితే ఆయ‌న ప్ర‌స్తుతం ఏ ప‌ద‌వి లోనూ లేడు. అయితే ప్ర‌దీప్ మాఝీ రాజీనామా ప్ర‌భావం కాంగ్రెస్ పార్టీ తీవ్రం గా ఉంటుంద‌ని రాజ‌కీయా విశ్లేష‌కులు అంటున్నారు.



ఇదీల ఉండ‌గా మాజీ ఎంపీ ప్ర‌దీప్ మాఝీ త‌న రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ కి పంపించాడు. తాను కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయ‌డం చాలా బాధ గా ఉంద‌ని అన్నాడు. తాను చివ‌రి వ‌రకు కాంగ్రెస్ పార్టీ లోనే ఉండి ప్ర‌జా సేవ చేయాల‌ని అనుకున్నాను అని తెలిపాడు. సోనియా గాంధీ నాయ‌క‌త్వం మెరుగ్గా ఉన్న కొంత మంది నాయ‌కుల వ‌ల్ల పార్టీ రోజు రోజు కు క్షిణిస్తుంద‌ని తెలిపాడు. ఇప్ప‌టికే ఒడిశా లో పార్టీ విశ్వ‌స‌నీయ‌త కోల్పోయింద‌ని అన్నారు. మ‌ళ్లి ప్ర‌జల మ‌ద్ద‌త్తు తిరిగి సంపాదించ‌డానికి చాలా సమ‌యం ప‌డుతుంద‌ని లేఖ లో వివ‌రించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్ర‌జ‌ల కు చాలా సేవ‌లు చేశాన‌ని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఇటు రాష్ట్రంలో అటు  అధిష్టానంలో ఉత్తేజం త‌గ్గి పొయింద‌ని అన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ ఎంపీ ప్ర‌దీప్ త్వ‌ర‌లోనే ఒడిశా ముఖ్య మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో బీజేడీ లో చేరుతార‌ని స‌మాచారం.  




మరింత సమాచారం తెలుసుకోండి: