ఆంధ్ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ వేడి జోరందుకుంది. ఓ వైపు తెలుగు దేశం పార్టీ దాడుల‌కు నిర‌స‌న‌గా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు దీక్ష చేప‌డితే. మరోవైపు త‌మ పార్టీ నాయ‌కుల‌పై, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అనుచ‌త వ్యాఖ్య‌లు చేసినందుకు గానూ ఆ పార్టీ నేత‌లు ప్ర‌జాగ్ర‌హ దీక్ష చెప‌ట్టారు. తెలుగు దేశం పార్టీ పై అల్ల‌రి మూక‌లు చేసిన దాడికి నిర‌స‌న‌గా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయ‌కుడు చేప‌ట్టిన 36 గంట‌ల దీక్ష కొన‌సాగుతోంది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల దీక్ష సాగుతుంది. దీంతో పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయ‌కుడుకి పార్టీ శ్రేణుల మ‌ద్ధ‌తు కొన‌సాగుతోంది. చంద్ర‌బాబు దీక్ష‌కు మ‌ద్ధ‌తు ఇస్తూ రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుంచి భారీ ర్యాలీలతో మంగ‌ళ‌గిరిలో ఉన్న టీడీపీ కేంద్ర‌ కార్యాలయానికి తెలుగు తమ్ముళ్లు త‌ర‌లివెళ్తున్నారు.


ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో 300 కార్లతో పార్టీ కార్యాలయానికి  పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్ర‌కాశం జిల్లా అద్దంకిలోని టీడీపీ కార్యాల‌యం నుంచి  భారీ ర్యాలీగా  బ‌య‌లుదేరి మంగ‌ళ‌గ‌రిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి చేరుకున్నారు. మంగళగిరి, హిందూపురం నుంచి భారీగా తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు. తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో పరిటాల సునీత, రామ్మోహన్ నాయుడు, కూన రవి, నన్నూరి నర్శిరెడ్డి జోష్ నింపారు. టీడీపీ కార్యాలయం ముందున్న సర్వీస్ రోడ్ జనంతో కిక్కిరిసిపోయింది. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో  మూడు ఫ్లోర్లు కిటకిటలాడుతున్నాయి.


  కూర్చొవడానికి చోటు దొరక్క నేతల తిప్పలు, జై తెలుగుదేశం నినాదాలతో టీడీపీ కార్యాలయ ప్రాంగ‌ణం మారిమోగిపోయింది. ఈ ఒక్క రోజే సుమారు 30-35 వేల మంది వచ్చార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. రెండు రోజుల్లో సుమారుగా 50 వేల మంది వస్తారని అంచనా వేసుకున్న టీడీపీ. మ‌రోవైపు రాష్ట్రంలోరాష్ట్రంలో జ‌రుగుత‌న్న ప‌రిణామాల‌పై సీబీఐ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేత‌లు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ప‌య్యావుల కేశ్‌, వ‌ర్ల రామ‌య్య‌, నిమ్మ‌ల రామానాయుడు త‌దిత‌రులు క‌లిసి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హరిచంద‌న్‌కు క‌లిసి విన‌తి ప‌త్రం అందజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: