ప్రస్తుతం టెలికామ్ రంగంలో ఎన్నో రకాల నెట్వర్క్లు వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఒకరికి మించి ఒకరు పోటీ పడుతూ ప్రస్తుతం ఎన్నో రకాల ఆఫర్లు కూడా అందిస్తూన్నాయి. అయితే ప్రస్తుతం టెలికాం రంగంలో ఎన్ని నెట్ వర్కులు ఉన్నప్పటికీ అటు ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థగా కొనసాగుతోంది మాత్రం బిఎస్ఎన్ఎల్ మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే భారత్లో ఎలాంటి టెలికాం నెట్వర్క్ లేని సమయంలో బిఎస్ఎన్ఎల్ ఎంతో మందికి బ్రాడ్బ్యాండ్ సేవలను అందించింది. ల్యాండ్ లైన్ దగ్గర నుంచి మొదలైన బిఎస్ఎన్ఎల్ సేవలు ఇక ఇప్పుడు స్మార్ట్ఫోన్ల వరకు కూడా చేరుకున్నాయి అని చెప్పాలి.



 కానీ ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల టెలికాం రంగ సంస్థలు రావడంతో ప్రభుత్వ రంగ బ్రాడ్బ్యాండ్ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కంటే మెరుగైన నెట్వర్క్  టెలికాం రంగ వినియోగదారులకు అందిస్తూ ఉండటంతో ఇక బిఎస్ఎన్ఎల్ రోజురోజుకు కనుమరుగవుతూ వచ్చింది అయితే తమ వినియోగదారులకు ఇప్పటికే ఎన్నో రకాల ఆఫర్లు ప్రకటించినప్పటికీ అటు టెలికాం రంగ సంస్థ లో ఉన్న పోటీ మాత్రం అటు ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ మాత్రం తట్టుకోలేక పోయింది అనే చెప్పాలి.  ఎన్నో ఏళ్ల నుంచి మాత్రం బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రం మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పుంజుకునేందుకు మరోసారి అవకాశం వచ్చింది.


 దేశీయ అంతర్జాతీయ విమానాల లో అత్యంత వేగవంతం  అయినటువంటి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడానికి ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కి లైసెన్స్ రావడం గమనార్హం. టెలికాం రంగ   విభాగం డాగ్ నుంచి లైసెన్స్ పొందింది బిఎస్ఎన్ఎల్.  భారత్లో గ్లోబల్ ఎక్స్ప్రెస్ బ్రాండ్ బ్యాండ్ అందించడానికి వ్యూహాత్మక భాగస్వామి అయిన బిఎస్ఎన్ఎల్ కు లైసెన్సులు దక్కాయని అటు బ్రిటిష్ పత్రికలు ప్రచురించాయి. టారిఫ్ ఛార్జిలు  ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటి రాలేదు. అయితే బిఎస్ఎన్ఎల్ పుంజుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం గా చెబుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: