ఆఫ్ఘానిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబన్లు.... తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే తమ పరిపాలనలో షియా చట్టాలను మాత్రమే అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాలిబన్ల ఆక్రమణ మొదలైన వెంటనే.... ఆఫ్ఘానిస్థాన్ నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర దేశాలకు పరారయ్యారు. తాలిబన్లకు ప్రధానమైన మద్దతు దారు ఎవరూ అంటే ఠక్కున చెప్పే పేరు పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదులను పెంచి పోషించే పాకిస్థాన్ అండతోనే తాలిబన్లు ఆఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం. ఆఫ్ఘాన్ తాలిబన్ల వశమైన వెంటనే... మా తదుపతి టార్గెట్ కశ్మీర్ అని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన కూడా సర్వత్రా చర్చకు దారి తీసీంది. తాలిబన్ల వల్ల భారత్‌కు తిప్పలు తప్పవని అంతా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి తాలిబన్లకు అటు పాకిస్తాన్, ఇటు చైనా దేశాలు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌కు ప్రతికూల పరిస్థితులు తప్పవని అందరూ భావించారు. కానీ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యింది.

ఆఫ్ఘానిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లకు అంతర్జాతీయ గుర్తింపు రావడం ప్రస్తుతం కష్టంగా మారింది. ఇందుకు ప్రధాన అడ్డంకి  పాకిస్తాన్‌తో దోస్తీ మాత్రమే. దీంతో ఇప్పుడు తాలిబన్లు, పాకిస్తాన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది. ఇదే సమయంలో తాలిబన్ల ఆకలి తీర్చేందుకు భారత్ తీసుకున్న నిర్ణయం కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆఫ్ఘానిస్థాన్ దేశం తీవ్ర ఆహార కొరతతో ఇబ్బంది పడుతోంది. అటు అగ్ర రాజ్యం అమెరికా కూడా సాయం చేసే విషయంలో చేతులెత్తేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నాం అంటూ ముందుకు వచ్చింది భారత సర్కార్. ఏకంగా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను తక్షణ సాయం కింద ఆఫ్ఘాన్‌లకు ఐక్య రాజ్య సమితి ద్వారా అందించేందుకు ఓకే చెప్పింది. మొదటి నుంచి పాకిస్తాన్ కంటే భారత్ సాయం మేలని తాలిబన్లు భావిస్తున్నారు. అందుకే చాలా విషయాల్లో భారత్ వైపు మొగ్గు చూపేందుకు రెడీ అయ్యారు తాలిబన్లు. ఇప్పటికే అధికారికంగా రెండు సార్లు చర్చలు కూడా జరిపారు. ఆఫ్ఘాన్లకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ విషయంలో, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా సాయం చేయాలని భారత్‌ను తాలిబన్లు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: