ఏపీలో అధికార వైసీపీ...ప్రతిపక్ష టి‌డి‌పిల మధ్య ఎలాంటి రచ్చ రాజకీయం నడుస్తుందో అందరికీ తెలిసిందే. ఒక పార్టీపై మరొక పార్టీ పైచేయి సాధించడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు...ఈ క్రమంలోనే ఏపీలో ఎలాంటి రాజకీయం చేస్తున్నారో కనబడుతూనే ఉంది. తాజాగా జరుగుతున్న ఘటనలే వాటికి ఉదాహరణలు. అయితే ఇదే క్రమంలో రెండు పార్టీలు ఊహించని డిమాండ్లతో ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు..ఆర్టికల్ 356 ఉపయోగించి...రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే జరిగిన ఘటనలపై సి‌బి‌ఐ విచారణ చేయాలని అడుగుతున్నారు.

జమ్మూకాశ్మీర్ లాంటి చోటే ఆర్టికల్ 356 వాడటానికి కేంద్రం ఆలోచిస్తుంది....అలాంటిది ఏపీలో వాడటం అనేది జరిగే పని కాదు. జరగదని తెలిసి కూడా బాబు డిమాండ్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందనే చెప్పొచ్చు. అలాగే సి‌బి‌ఐ విచారణ కూడా జరిగే పని కాదనే చెప్పొచ్చు. టి‌డి‌పి వర్షన్ ఇలా ఉంటే....వైసీపీ వర్షన్ మరొకలా ఉంది. పట్టాభి....సి‌ఎం జగన్‌ని తిట్టినందుకు గానూ..టి‌డి‌పిని నిషేధించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


 మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే టి‌డి‌పి గుర్తింపుని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసీపీ సిద్ధమైంది.  టి‌డి‌పి నేతల మాట్లాడే బూతులని ఎన్నికల సంఘం దృష్టికి వైసీపీ తీసుకెళ్లి, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయమని అడగనుంది...అలాగే ఎన్నికల వేళ మాత్రమే కాకుండా..మిగిలిన సమయంలో కూడా నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనుంది.

సరే వైసీపీ డిమాండ్ బాగానే ఉంది...మరి అంతా సులువుగా అయిపోతుందా? అంటే అవ్వదనే చెప్పాలి. అదే సమయంలో టి‌డి‌పి నేతల బూతుల వీడియో క్లిప్పింగ్‌లని ఇవ్వడం బాగానే ఉంది...మరి టి‌డి‌పి వెళ్ళి....ఇప్పటివరకు వైసీపీ నేతల మాట్లాడిన బూతుల వీడియో క్లిప్పులని ఇస్తే పరిస్తితి ఏంటి? అంటే ఎటు తిరిగి వైసీపీకే రివర్స్ అయ్యే పరిస్తితి ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp