రాష్ట్రంలో ఎలాంటి రాజకీయం జరిగినా అది కేంద్రం వరకు వెళ్లిపోతుంది. ప్రతిసారి ఇదే తంతు....ఇప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిలు కుస్తీ పడుతూ...ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికి రెడీ అయిపోయారు. వైసీపీ శ్రేణులు..తమ పార్టీ ఆఫీసులపై దాడులకు సంబంధించి కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. అదేం అంటే రాష్ర్టంలో శాంతిభద్రతలు లేవని, వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోరుతున్నారు. అలాగే జరిగిన ఘటనలపై సి‌బి‌ఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు కేంద్రాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదే సమయంలో టి‌డి‌పి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, తక్షణమే టి‌డి‌పి గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే టి‌డి‌పి ఫిర్యాదు వంకతో బి‌జే‌పికి మళ్ళీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ విమర్శలు చేస్తుంది. మళ్ళీ మోడీ, అమిత్ షాలని కలిసి, బి‌జే‌పితో జట్టు కట్టాలని చూస్తుందని అంటున్నారు. ఇక వైసీపీ విమర్శలు నిజమో కాదో...భవిష్యత్‌లో తెలుస్తోంది.

నిజానికి కేంద్రంలో బి‌జే‌పితో కాస్త సఖ్యతగా ఉన్నది వైసీపీనే....రాష్ట్రంలో ఎలాగైనా ఉన్నా సరే కేంద్రంలో మాత్రం సఖ్యతగానే ఉంటున్నారు. అయితే బి‌జే‌పితో జగన్‌కు ఉన్న చీకటి సంబంధాలని తాము దెబ్బతీస్తామని వైసీపీ భయపడుతుందని టి‌డి‌పి నేతలు మాట్లాడుతున్నారు. అసలు పొత్తు విషయంలో ఎలాంటి చర్చ లేదని, అది ఎన్నికల సమయంలో తేలుతుందని, ఒకవేళ ఏమైనా ఉన్నా సరే ఎన్నికల సమయంలోనే బహిరంగంగానే చెబుతామని అంటున్నారు.

అయితే టి‌డి‌పితో పొత్తు విషయంలో బి‌జే‌పి మాత్రం చాలా దూరం ఉందనే చెప్పాలి. అసలు టి‌డి‌పిని దగ్గరకు రానిచ్చే పరిస్తితి కేంద్రంలో లేదు. కానీ వైసీపీ మాత్రం....బి‌జే‌పికి చంద్రబాబు దగ్గరవ్వాలని చూస్తున్నారని హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. అటు తిప్పి,ఇటు తిప్పి వైసీపీనే...టి‌డి‌పి-బి‌జే‌పిల పొత్తు సెట్ అయ్యేలా చేసేలా ఉంది. మరి చూడాలి పొత్తుల అంశం ఎప్పుడు తేలుతుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp