వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన పూర్తిగా వర్షన్ మార్చేశారు...గతానికి భిన్నంగా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఎప్పుడూలేని విధంగా మాట్లాడుతున్నారు. మామూలుగా విజయసాయి అంటే...కౌంటర్లు, పంచ్‌లు. అసలు టి‌డి‌పి నేతలు గానీ, చంద్రబాబు గానీ..జగన్‌పై ఏమన్నా విమర్శలు చేస్తే వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేసి....తనదైన శైలిలో కౌంటర్లు, పంచ్‌లు వేసేస్తారు.

అలాగే ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్దగా దిక్కుగా వ్యవహరిస్తూ...అక్కడ పార్టీ కోసం కృషి చేసే నాయకుడు. అలాంటిది ఒక్కసారిగా విజయసాయి రెడ్డిలో మార్పు వచ్చింది. కొంతకాలం అయితే ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియలేదు. అలాగే సడన్‌గా ఎంట్రీ ఇచ్చి... విశాఖలో సాఫ్ట్‌గా పనులు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.


అలా చేస్తున్న విజయసాయి రాజకీయ పరమైన విమర్శల జోలికి వెళ్ళడం లేదు...అయితే తాజాగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం ముదిరిపోయింది. ఈ క్రమంలోనే విజయసాయి బయటకొచ్చి...చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేశారు. కానీ మునుపటిలా ఓ ఫైర్ అయిపోలేదు. ప్రజస్వామ్యంలో విమర్శలు అనేవి నిర్మాణాత్మకంగా ఉండాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం జగన్‌ని తిట్టడం సరికాదని మాట్లాడారు. ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు.


అయితే మునుపటి మాదిరిగా ఆ సెటైర్లు, పంచ్‌లు విజయసాయి దగ్గర నుంచి రాలేదు. విజయసాయి పద్ధతిగా ప్రతిపక్షంపై నిర్మాణాత్మకమైన విమర్శలే చేశారు. కానీ గతంలో విజయసాయి ఇలా మాట్లాడలేదు..చంద్రబాబు అంటే ఫుల్ గా ఫైర్ అయిపోయారు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో చంద్రబాబుపై ఏదొక పంచ్ పడిపోయేది. కానీ ఆ పంచ్‌లు తగ్గిపోయాయి...ఆ ఫైర్ తగ్గిపోయింది. మరి ఇలా విజయసాయి ఫైర్ తగ్గడానికి వెనుక ఏమన్నా కారణాలు ఉన్నాయా? లేక ఇలాగే ఇంకా రాజకీయం చేయాలనుకుంటున్నారా? అనే విషయం మాత్రం తెలియడం లేదు. మరి చూడాలి విజయసాయి ఎంతవరకు ఇలా ఉంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: