రాజకీయంగా పైచేయి సాధించడానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిలు విపరీతంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు పార్టీలు రాష్ట్రంలో ఎలాంటి రచ్చ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీల రచ్చ చూసి...జనాలకు చిరాకు వచ్చే పరిస్తితి ఉంది. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ అభిమానులు ఉన్నారు. వారు తప్ప..మిగిలిన ప్రజలు...వైసీపీ-టి‌డి‌పి చేస్తున్న రాజకీయం చూసి విసిగిపోయారనే చెప్పాలి.
 
అసలు రాష్ట్ర విభజన జరిగాక...రాష్ట్రం పరిస్తితి మరీ దారుణంగా తయారైంది...కేంద్రం ఎలాగో రాష్ట్రానికి సాయం చేయదు. కానీ ఇక్కడున్న పార్టీలు ఏమో తమ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలిచేసే పరిస్తితి వచ్చేసింది. ఐదేళ్ల పాటు అనుభవం ఉందని చంద్రబాబుకు అధికారం ఇస్తే బొమ్మ చూపించారు. ఐదేళ్లలో గ్రాఫిక్స్ తప్ప ఇంకేమీ కనబడలేదు. సరే చంద్రబాబు ఏం చేయలేకపోయారు...జగన్ మామూలుగా చేయరని జనాలు అనుకున్నారు. అందుకే జగన్ భారీగా సీట్లు కూడా ఇచ్చేశారు.


మరి అంతటి భారీ మెజారిటీతో గెలిచి సి‌ఎం అయిన జగన్ ఏం చేస్తున్నారో....ఈ రెండున్నర ఏళ్లలో జనాలకు బాగా క్లారిటీ వచ్చేసింది...కానీ వైసీపీ అధికారంలో ఉండటంతో...ఆ అసంతృప్తి లోపలే పెట్టుకుంటున్నారు గానీ, బయటకు చూపించే పరిస్తితి కనిపించడం లేదు. కానీ జగన్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారనే మాట మాత్రం వాస్తవం అని అందరికీ తెలుసు. కానీ బయటకు చెప్పే పరిస్తితి లేదు. అంటే సి‌ఎంగా జగన్ కూడా రాష్ట్రాన్ని బాగుచేసింది ఏమి లేదు.


మరి ఇలాంటప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎదిగే అవకాశం ఉంది. చంద్రబాబు, జగన్‌లు ఏంటో ప్రజలకు అర్ధమైంది. అలాంటప్పుడు తాను ఏంటో చూపించుకోవాల్సిన బాధ్యత పవన్‌పై ఉంది. వాళ్ళ కంటే తాను బెటర్ అనే కోణం పవన్ చూపించాలి. ప్రజలకు అండగా నిలబడాలి...సమస్యలపై పోరాడాలి. పవన్ క్లిక్ ఇవ్వడానికి మంచి సమయం. కానీ పవన్ దీన్ని పెద్దగా ఉపయోగించుకుంటున్నట్లు కనిపించడం లేదు. అందుకే జనసేనకు ఎదుగుదల ఉండటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: