ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టున్న నియోజకవర్గం. పార్టీ పెట్టిన మొదట్లో చీరాలలో టి‌డి‌పి సత్తా చాటింది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో నాలుగుసార్లు గెలిచింది. కానీ తర్వాత నుంచి కాస్త పట్టు తగ్గింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. అయితే 2014 ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్...ఆ తర్వాత టి‌డి‌పిలోకి వచ్చేశారు.

 ఐదేళ్ల పాటు టి‌డి‌పి అధికారంలో ఉండగా బాగానే పని చేసుకుంటూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల ముందు ఆమంచి....వైసీపీలోకి జంప్ చేశారు. ఆమంచి వైసీపీ వైపుకు వెళ్ళడంతో చంద్రబాబు...టి‌డి‌పి సీనియర్ నేత కరణం బలరాంని చీరాల బరిలో దించారు. ఇక రాష్ర్టం మొత్తం జగన్ గాలి ఉన్నా సరే చీరాలలో టి‌డి‌పి జెండా ఎగిరింది. మంచి మెజారిటీతో కరణం ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టి‌డి‌పి అధికారంలోకి రాకపోవడంతో రాజకీయాలు మారిపోయాయి.

ఎన్నో దశాబ్దాల పాటు టి‌డి‌పిలో పనిచేసిన కరణం...తన వారసుడు వెంకటేష్‌తో కలిసి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అటు ఆమంచి, కరణంలు ఇద్దరు వైసీపీలోనే ఉండిపోయారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టి‌డి‌పిని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో వైసీపీలో గ్రూప్ తగాదాలు పెరిగాయి...కానీ టి‌డి‌పికి సరైన నాయకత్వం లేకుండా పోయింది. అయితే 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టి‌డి‌పిలోకి వచ్చిన యడం బాలాజీకు చీరాల బాధ్యతలు అప్పగించారు.

2014 ఎన్నికల్లో యడం...వైసీపీ తరుపున పోటీ చేసి 40 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనే చీరాలలో టి‌డి‌పి కోసం పనిచేస్తున్నారు. కానీ యడం...చీరాలలో టి‌డి‌పిని బలోపేతం చేయలేకపోతున్నారు. ఇక్కడ పూర్తిగా వైసీపీదే ఆధిక్యం కనిపిస్తోంది. వైసీపీలో పరిస్తితులు ఎలా ఉన్నా సరే...ఇక్కడ టి‌డి‌పికి మాత్రం అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. నెక్స్ట్ ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేయాలని ఆమంచి కృష్ణమోహన్ ప్రయత్నిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి ఎవరు బరిలో దిగిన, ఇక్కడ టి‌డి‌పి అడ్రెస్ మాత్రం గల్లంతే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp