పంజాబ్ కాంగ్రెస్‌లో మ‌రోమార్పు చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న హ‌రీశ్‌రావ‌త్‌ను తొల‌గించి మ‌రోవ్య‌క్తిని నియ‌మించాల‌ని కాంగ్రెస్ భావిస్తొంద‌నే  ఊహ‌గానాల‌కు తెర‌ప‌డింది.  హ‌రీశ్‌రావ‌త్‌ను తొల‌గించి ఆయ‌న స్థానంలో పంజాబ్ ఏఐసీసీ సెక్రెట‌రీగా ఉన్న రాజ‌స్థాన్ ఆర్థిక‌మంత్రిగా ఉన్న హ‌రీశ్‌చౌద‌రిని తాజాగా నియ‌మించింది. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యునిగా హ‌రీశ్‌రావ‌త్ కొన‌సాగ‌నున్న‌ట్టు తెలిపింది. పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు రానున్న త‌రుణంలో కాంగ్రెస్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. పంజాబ్‌, చండిగ‌డ్ ఏఐసీసీ ఇన్‌చార్జీగా హ‌రీశ్‌చౌద‌రిని నియామ‌కం చేప‌ట్టింది కాంగ్రెస్‌. ఇంత‌కుముందు సేవ‌లందించిన హ‌రీశ్ రావ‌త్‌కు  కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా హ‌రీశ్‌రావ‌త్ చేసిన  సేవ‌ల‌కు, కృషిని పార్టీ ప్ర‌శంసిస్తోంద‌ని ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. కాంగ్రెస్ ప్ర‌ధాన నేత రాహుల్‌గాంధీని  ఇటీవ‌ల హ‌రీశ్‌రావ‌త్ క‌లిశారు. రాహుల్‌గాంధీని క‌లిసిన రెండు రోజులకే అధిష్టానం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఉత్త‌రాఖండ్‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించేందుకే పంజాబ్ ఇన్‌చార్జి ప‌ద‌వీ నుంచి త‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని రావ‌త్ రాహుల్‌గాంధీని కోరిన‌ట్టు తెలుస్తోంది. స‌మావేశం ముగిసిన అనంత‌రం రావ‌త్ త‌న ట్విట్ట‌ర్‌లో ఒక పోస్ట్ చేశారు.

నా జ‌న్మ‌భూమికి న్యాయం  చేయ‌గ‌లిగితేనే నా క‌ర్మ‌భూమికి నా క‌ర్మ‌భూమికి న్యాయం చేయ‌గలుగుతాన‌ని పేర్కొన్నాడు. పంజాబ్ కాంగ్రెస్‌తో పాటు ఆ రాష్ట్రం యొక్క ప్ర‌జ‌ల దీవెన‌లు, నిరంత‌రం వారి మ‌ద్ద‌తుకు కృత‌జ్క్ష‌తుడిని అని వెల్ల‌డించారు. కొద్దిరోజుల పాటు ఉత్త‌రాఖండ్‌కు పూర్తిస‌మ‌యాన్ని కేటాయించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిపాడు. ఇందుకు పంజాబ్‌లో నా యొక్క బాధ్య‌త నుంచి విముక్తి పొందాల‌ని అనుకుంటున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు.  ఉత్త‌రాఖండ్‌లో నిర్వ‌హించే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీలో హ‌రీశ్‌రావ‌త్ కీల‌కంగా మార‌నున్నాడు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అక్క‌డ కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుంటే రావ‌త్ ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ ఉంద‌ని ఊహ‌గానాలు కూడ వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: