హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శనిగరం, కమలాపూర్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. అడుగడుగునా స్వాగతం పలుకుతూ, బిజెపిని అక్కున చేర్చుకుంటున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.  పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. పన్నుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల  నుండి రూ.వేల కోట్లు దోచుకుంటోంది. వాస్తవానికి ఒక్కో లీటర్ పెట్రోలుపై కేసీఆర్ ప్రభుత్వం 41 రూపాయలు దోచుకుంటోంది. కేసీఆర్ కు ప్రజలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే...ఆ పన్ను మొత్తాన్ని మినహాయించుకుంటే 60 రూపాయలకే లీటర్ పెట్రోలు అందించవచ్చు. రోడ్లు, డ్రైనేజీ, ఇండ్ల నిర్మాణం, రేషన్ బియ్యం సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృధ్ది, సంక్షేమ పథకాలకు అయ్యే నిధులను కేంద్రమే అందిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను దారి మళ్లించి ఉప ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తోంది. ఒక్కో ఓటుకు రూ.20 వేలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు. ఆ సొమ్ములో రూ.15 వేలు టీఆర్ఎస్ నేతలు కొట్టేసి ఓటర్లకు రూ.5 వేలు మాత్రమే ఇస్తూ....మిగిలిన సొమ్ముతో కొత్త కార్లు కొంటున్నారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రేనేజీ, మరుగుదొడ్లు, స్మశాన వాటికల నిర్మాణం సహా అభివృద్ది, సంక్షేమ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఖర్చు పెడుతున్నరు. కమలం పువ్వు గుర్తు వాళ్లు ఇంత పెద్ద ఎత్తున నిధులిస్తుంటే, కనీసం నరేంద్రమోదీ గారి పేరును ప్రస్తావించని సిగ్గులేని నేతలు టీఆర్ఎసోళ్లు. హుజూరాబాద్ ప్రజలందరికీ టీఆర్ఎస్ సంగతి అర్ధమైంది. రాష్ట్రంలో ఈ మూర్ఖుడి పాలనతో ఆగమైపోతున్నరు. వాళ్లంతా హుజూరాబాద్ ప్రజలకు చేతులు జోడించి మొక్కుతున్నరు. టీఆర్ఎస్ దోపిడీ పాలన అంతం కావాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నరు. 30న జరిగే పోలింగ్ లో కమలం పువ్వు గుర్తుకు అందరూ ఓటేసి టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టాలి. కేసీఆర్ మైండ్ షాక్ కావాలి.

వచ్చే నెల 2న ‘ట్రిపుల్ ఆర్ సినిమా’ను ప్రగతి భవన్ ముందు ప్రొజెక్టర్ పెట్టి కేసీఆర్ కు చూపిస్తాం. అందులో ఒక ఆర్.. రాజాసింగ్.. రెండో ఆర్.. రఘునందన్ రావు....ఇక గెలవబోయే మూడో వ్యక్తి రాజేందర్...ఈ ముగ్గురితో ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపించబోతున్నం. ఈ సినిమా చూపించాలంటే ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: