ఇండియన్ పాలిటిక్స్ లో అతను గేమ్ చేంజర్. బిజెపిలో అతనో ట్రబుల్ షూటర్. ప్రధాని మోదీ కి అతనో కమాండర్. టోటల్ గా అమిత్ షా ఒక అపర చాణిక్యుడు, అంతకుమించిన దేశభక్తుడు. ఆర్ఎస్ఎస్ నుంచి మొదలైన షా ప్రయాణం ఇప్పుడు దేశ హోంమంత్రి స్థాయికి చేరింది. మోదీ క్యాబినెట్ లో ఎవరైనా అమిత్ షా తర్వాతే. బిజెపి లో ఆ ఇద్దరికి తిరుగులేదు ఇద్దరూ ఇద్దరే. ఒకరు దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు, మరొకరు రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. అందుకే దేశ రాజకీయాల్లో ఈ ఇద్దరికీ ఎదురే లేకుండా పోయింది. మోదీ ముందుండి దూసుకు వెళుతూ ఉంటే, అమిత్ షా వెనకుండి అంతా నడిపిస్తున్నారు. విజయం ఎప్పుడూ ఒకరిద్దరు సొంతం కాదు. అందులో వందలాది మంది కృషి ఉంటుంది.

కానీ ఆ వందలాదిమంది నడిపించేది వారి ముందుండి నడిచేది మాత్రం  ఒకరిద్దరు మాత్రమే ఉంటారు, వాళ్లే లీడర్లు. బిజెపి విషయానికి వస్తే ఆ లీడర్లు నరేంద్ర మోడీ,అమిత్ షా. దేశ రాజకీయ చరిత్రలో  ఈ స్థాయి దూకుడు రాజకీయాలను ప్రజలెవ్వరూ చూడలేదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. కనీసం వాటి గురించి ఊహించడానికి కూడా వణుకు పుట్టె నిర్ణయాలు తీసుకుంది. నిర్ణయాలు తీసుకోవడం వేరు వాటిని అనుకున్న రీతిలో అమలుపరచడం వేరు. దీటుగా నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ సిద్ధహస్తుడయితే, వాటిని పక్కాగా అమలు పరచడంలో  అమిత్ షా దిట్ట. గ్రౌండ్ లెవెల్ లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్న వాటన్నింటినీ పరిష్కరించి నిర్ణయాన్ని చక్కగా అమలు చేయడంలో అమిత్ షా కు సాటి మరెవ్వరూ లేరు. ఓవైపు మోడీ తీసుకునే నిర్ణయాలను అమలు పరచడంతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా పాతే విధంగా అమిత్ షా అడుగులు వేస్తున్నారు. ఒక్కో రాష్ట్రాన్ని పార్టీకి కంచుకోటగా మార్చే పనిలో పడ్డారు. అనేక రాష్ట్రాల్లో ఏళ్లకు ఏళ్లుగా పాతుకుపోయిన పార్టీలను గద్దె దింపి కాషాయ జెండాను ఎగరేశారు. అందుకే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా మోదీ మదిలో మెదిలే వ్యక్తి అమిత్ షా. మోడీ ఆదేశాలివ్వడమే తడవుగా అక్కడ ప్రత్యక్షమై తన చాణుక్య చతురతతో ఆ సమస్యకు పరిష్కారం వెతుకుతారు. అమిత్ షా రాజకీయ జీవితంలో మెరుపులే కాదు అక్కడక్కడ మరకలు కూడా ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అమిత్ షా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. రాజకీయంలో ఎంతటి గొప్ప నాయకుడైన మరకలు సహజంగానే ఉంటాయి. ప్రజా జీవితంలో వుండే వారిపై ప్రత్యర్థులు బురద చల్లడం ఖాయం. అయితే ఇవేవీ అమిత్ షా రాజకీయ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: