ఏపీలో బ‌ద్వేల్ ఉప ఎన్ని క ముగిసిన వెంట‌నే వ‌రుస‌గా ఎన్నిక‌లు జ‌రిగేందుకు రంగం సిద్ధ మ‌వుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మునిసిపాలిటీలలో వచ్చే నెల తొలి వారంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే నెల  7 లేదా 8 తేదీల్లో ఎన్నికలు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ సైతం ఏర్పాట్లు చేసు కుంటోంది. ఈ యేడాది జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో నాలుగు కార్పొరేష‌న్ల తో పాటు మ‌రో 32 మున్సిపాల్టీలు , న‌గ‌ర పంచాయ‌తీల్లో ఎన్నిక‌లు నిలి చి పోయాయి. ఇప్పుడు వీటికి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

నెల్లూరు కార్పొరేష‌న్ తో పాటు చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం తో పాటు బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు) - ఆకివీడు(పశ్చిమగోదావరి) - జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా) - దాచేపల్లి, గురజాల(గుంటూరు) - దర్శి(ప్రకాశం) - బేతంచెర్ల(కర్నూలు) - కమలాపురం, రాజంపేట(వైఎస్సార్‌) - పెనుకొండ(అనంతపురం) మునిసిపాలిటీలలో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతాయి.

సోమ , మంగ‌ళ వారాల్లో వీటికి నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. నోటిఫి కేష‌న్ జారీ అయిన మ‌రుసటి రోజు నుంచే అక్క‌డ నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. ఈ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. అలాగే ఏపీలో ఖాళీగా ఉన్న 14 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 71 గ్రామాల్లో సర్పంచ్, 176 స్థానాల్లో ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు ఒక రోజు ముందు స‌ర్పంచ్ ఎన్నిక‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌ల మ‌రుస‌టి రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన స్థానాల్లో కొంద‌రు మృతి చెందారు. వీరిలో   కారంపూడి (గుంటూరు) - లింగాల (వైఎస్సార్‌)  - కొలిమిగుండ్ల (కర్నూలు)  స్థానాలతో పాటు ఎన్నిక నిలిచిన మరో 11 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగు తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: