సీఎం కేసీఆర్ కి ఈట‌ల‌కు మ‌ధ్య వ‌చ్చిన త‌గాదానే హుజురాబాద్ ఉప ఎన్నికనే అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌న్మంత‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విహెచ్ గురించి ఆయ‌న మాట్లాడే తీరు గురించి తెలంగాణ మొత్తం తెలుసు. ఏ విష‌యం అయినా త‌న మాట తీరుతో పెద్ద‌దిగా చేసే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంలో ఈ సీనియ‌ర్ నేత తీరే వేరు. ఇలా మాట్లాడ‌కూడ‌ద‌ని ఆలోచించ‌కుండా మాట్లాడుతార‌ని అంద‌రూ అనుకుంటారు. మ‌రోసారి ఈ విష‌యాన్ని నిరూపించారు వీహెచ్‌.
 

 కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ఆయా పార్టీల నేత‌లు ప్ర‌చారాన్ని ఉధృతం చేస్తున్నారు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గం అంత‌టా రాజ‌కీయ వేడి రాజుకుంది. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్‌లో వీ హ‌న్మంత‌రావు ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం డ‌బ్బులు పంచుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ద‌ళిత బంధు ఇవ్వాల‌ని డిమాండ్ చేశామ‌ని, కొన్ని కులాల‌వారు అడుక్కునే ప‌రిస్థితిలో ఉన్నార‌ని అలాంటి వారికి కూడా ద‌ళిత బంధు ఇవ్వాల‌న్నారు హ‌న్మంత‌రావు.


 బీజేపీ నేత ఈట‌ల‌కు మంచి పేరు ఉండేద‌ని ఎందుకు బీజేపీలోకి వెళ్లారో తెలియ‌ద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ కోసం పోరాడాడ‌ని, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశాన్ని నాశ‌నం చేస్తున్న బీజేపీలో చేరితే ఓటు ఎలా వేయాల‌ని ప్ర‌శ్నించారు విహెచ్‌. బీజేపీ ఏం అభివృద్ధి చేసింద‌ని ప్ర‌శ్నించారు. బేటీ బ‌చావో ప‌డావో అంటున్న బీజేపీ ప్ర‌భుత్వ హ‌యాంలో రోజుకో రేప్ జ‌రుగుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.



కాగా కాంగ్రెస్‌కు మాత్ర‌మే దేశానికి పాలించే అర్హ‌త ఉంద‌న్నారు వి.హ‌న్మంత‌రావు. ఇటు వీహెచ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు వ్య‌తిరేకిస్తే కొంద‌రు మ‌ద్ధ‌తు ఇస్తున్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్లో వంద శాతం నిజం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈట‌ల ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌న్నా వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: