చైనాలో కూడా ఐఎస్ విధ్వంసాలు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఒక వీధివీధినే బాంబులతో లేపేశారు. ఇదే అసలు అత్యంత భయానకమైన, తీవ్రమైన పేలుడు చైనాలో. ఇదంతా ఐఎస్ పనే అని అర్ధం అవుతుంది. చైనా పరిస్థితి దగ్గర నుండి చుసిన వాళ్ళు కాబట్టి ఆ దేశం పని అయిపోయిందని, ఇప్పుడే దాడులు చేస్తేత్వరగా దానిని కూడా తీవ్రవాద దేశంగా తమ ఆధీనంలోకి తెచుకోవచ్చని వాళ్ళు భావించి ఉండవచ్చు. చైనాలో ఇప్పటికే అనేక సంక్షోభాలు విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు చైనాలో ఇలాంటి పేలుళ్లు జరిగినట్టే తెలియదు. దీనిని కూడా చైనా ప్రభుత్వం మూసిపెట్టడానికి ప్రయత్నిస్తుంది అని తెలిసే అలాంటి అవకాశం లేని విధంగా భయానక పేలుడు చేసినట్టు ఉంది ఐఎస్. ఎవరి తెలివితేటలు వాళ్ళవి. అందుకే పాముకు పాలు పోసి పెంచొద్దు అంటారు పెద్దలు. తన స్వలాభం కోసం పాక్, చైనాలు తీవ్రవాదాన్ని పెంచి పోషించాయి, చివరికి వారిపైనే విషాన్ని చిమ్ముతున్నాయి ఆ సంస్థలు.

తాజా పేలుళ్లతో ఒక వీధి మొత్తం ధ్వంసం అయిందంటే ఆ తీవ్రత ఎంత భయానకంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అక్కడ పేలుళ్లకు ప్రాంతీయంగా ఉన్న గ్యాస్ కూడా తోడు అవడంతో ఈ తీవ్రత మరింతగా పెరిగిపోయింది. బహుశా ఈమాత్రం తీవ్రత ఉంటె తప్ప మీడియా ద్రుష్టి అటువైపు పడదని మంచి స్పాట్ చూసి మరి పేల్చినట్టు ఉన్నారు ఉగ్రమూక. ఇప్పటికే చైనాకు తెలియకుండా వాళ్ళ ప్రాంతంలోనే ఉగ్రమూకలు ఒక స్థావరం ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది కదా. దానిని తీసేయాలని బహుశా రహస్య చర్చలు జరిగి ఉండవచ్చు.

ఆ చర్చలు విఫలం అవడంతోనే, చైనా సైన్యాన్ని పెట్టి దానిని ఖాళీ చేయించే ప్రయత్నాలు ప్రారంభించే లోపు ఈ తరహా పేలుళ్లతో తమ సమాధానం చెప్పినట్టుగా ఉంది ఉగ్రమూక. ఇప్పటికే పాక్ ఉగ్ర శిబిరంగా మారిపోయింది. అనంతరం ఆఫ్ఘన్ తాలిబన్ ఉగ్రమూక స్వాధీనం చేసుకొని కొత్త దేశం అదికూడా తీవ్రవాదులకు ఏర్పాటు అయిపోయింది. ఇప్పుడు ఉగ్రశిబిరాలు చైనా కు చేరాయి. మొత్తానికి ఒక్క దేశం స్థావరం ఇస్తే, వాళ్ళు చక్కగా మూడు దేశాలను స్వాధీనంలోకి తెచ్చేసుకుంటున్నారు. అదేదో సామెత చెప్పినట్టు, జాలిపడి కాస్త స్థానం ఇస్తే, ఇచ్చినవాడినే తరిమి ఆ స్థావరాన్ని ఆక్రమించాడట ఒకడు, ఇది కూడా చూడబోతే అలాగే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: