కొందరు సాయం పొంది చేతిని ఇచ్చే వాళ్ళు ఉంటారు, సాయం చేశారు కదా అని గుర్తుపెట్టుకొని మరి స్నేహితులుగా వెంటనే ఉండేది కొందరు. ఒకప్పుడు సాయం పొందిన ఇజ్రాయెల్, భారత్ కు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా తోడుగా ఉండేది. కానీ ఒకప్పుడు అల్లకల్లోలంగా ఉన్న పాక్ తో ఉండిన బంగ్లాదేశ్ నుండి ప్రజలు భారత్ కు పెద్ద ఎత్తున వలస వస్తున్నప్పుడు ఇలా ఎంతమంది పారిపోతారు అని ధైర్యం చెప్పి, పాక్ తో చర్చించి, ఫలితం లేకపోతే యుద్ధం చేసి మరి ఓడించి, ప్రత్యేక దేశంగా బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసి, వారినే పరిపాలించుకోవాలని చెప్పింది భారత్. అలాంటిది నేడు అక్కడ మైనారిటీగా ఉన్న హిందువుల పట్ల నీచంగా ప్రవర్తిస్తూ దిగజారిపోతోంది బంగ్లాదేశ్. అందుకు కారణం కూడా లేకపోలేదు, పాక్ ఎప్పటికప్పుడు లేనిపోనివి నూరిపోస్తూ వస్తుంది. దానితో ఆ దేశం మాటలు విని ఇన్నాళ్లు తనను వెన్నంటి ఉండి అన్ని సాయాలు అందించిన భారత్ పై కన్నెర్రజేస్తూ బంగ్లాదేశ్ తప్పుడు పని చేస్తుంది.

భారత్ తో శత్రుత్వాన్ని పెంచుకొని పాక్ సంక్షోభంలోకి వెళ్ళిపోతే, బంగ్లాదేశ్ ను మాత్రం భారత్ అలా కనీయకుండా ఎప్పటికప్పుడు అనేక ఒప్పందాలతో వాణిజ్యం సహా పలు సాయాలు చేస్తూ ఆదేశాన్ని నిలదొక్కుకునేలా చేసింది. అవన్నీ మరిచిపోయి నేడు పరిస్థితులు బాగా ఉన్నాయనే అహం తో ఆ దేశం భారత్ పై పాక్ చెప్పిందనే ఒకేఒక కారణం చేత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. మైనారిటీలపై దాడులు జరిగినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడాన్ని కారణం ఇదే.

ఇవన్నీ చూస్తున్నప్పటికీ భారత్ మాత్రం సంయమనంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం పై మాకు నమ్మకం ఉంది అని స్పష్టం చేసింది. అంతకు మించి భారత్ స్పందించినా దానిని కూడా నెపంగా చేసుకొని దానిని కూడా యాగీ చేసి, భారత్ పై విరుచుకుపడాలన్నది ఉగ్ర వ్యూహం. ఎంతగా భారత్ పై ఒత్తిడి తీసినా భారత్ సంయమనంతో ఉండటానికి కారణం అదే. ఇవన్నీ చేయడం ద్వారా భారత్ పై మానసికంగా, అలాగే కొద్దిగా అన్నా ఉద్రేకం పొంది ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, తమకు కలిసి వస్తుందని గోతికాడ నక్కల మాదిరి ఉగ్రమూకలు, చైనా, పాక్ లు ఎదురు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: