గత కొద్దిరోజుల నుంచి పాకిస్తాన్ తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని దీంతో ప్రపంచ దేశాలు తలనొప్పిగా మారిందని అన్ని దేశాలు కలిసి పాకిస్తానుకు బుద్ధి చెప్పాలని అనుకుంటున్నట్లు  తెలుస్తోంది. అది ఏంటో తెలుసుకుందాం..? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మరో షాక్ తగిలింది. దేశం గడవడానికి అప్పుల కోసం అన్వెషిస్తున్న పాకిస్తాన్ కు ఎక్కడ అప్పు దొరకడం లేదు. తాజాగా పాకిస్తాన్ గ్రే జాబితాలోనే కొనసాగుతుందని ఫైనాన్సియల్ టాస్క్ ఫోర్స్ తెలిపింది. నిర్దేశించిన మొత్తం 34 విధులు 30 విధులను మాత్రమే నిర్వర్తించి నందుకు ఆర్థిక సాయం అందించలేమని తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక సాయం  పొందే విషయంలో పాకిస్తాన్ కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.

ఆ దేశాన్ని గ్రే లిస్టు లోనే కొనసాగించాలని ఫైనాన్సియల్ టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది. ఈ మేరకు వర్చువల్ గా నిర్ణయించిన ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు తెలిపారు. పాకిస్తాన్ ఇప్పటివరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా కీలకమైన చర్యలు చేపట్టిందని ఎఫ్ఎటీఎఫ్ తెలిపింది. అయితే ఐక్యరాజ్య  సమితి గుర్తించిన ఉగ్రవాదులు మసూద్ అజర్, ఆఫీ సాయిద్ సహా వారి బృందాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను పాక్ మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఎఫ్ఎటిఎఫ్ పేర్కొంది. సంపూర్ణంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాలని ఎఫ్ఏటిఎఫ్ సూచించింది. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాకిస్థాన్ కు ఎప్పటి నుంచో గ్రే జాబితాలో కొనసాగుతుంది.

దీంతో అంతర్జాతీయ ఆర్థిక సాయం  పొందే విషయంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, మనీలాండరింగ్ నేరాలకు పాల్పడుతుందనే కారణంతో పాకిస్థాన్ను గ్రే జాబితాలో చేర్చిన ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాక్ ను అదే స్థానం లో కొనసాగించాలని నిర్ణయించడం గమనార్హం. మరోవైపు జోర్డాన్, మాలి, టర్కీ దేశాలకు తమ జాబితాలో చేరుతున్నట్లు ఎఫ్ఎటిఎఫ్ తెలిపింది. ఈ మూడు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కార్యచరణ చేపట్టడానికి అంగీకరించాయని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: