ఎప్పుడొచ్చాం అన్న‌ది కాద‌న్న‌య్యా బుల్లెట్టు దిగిందా లేదా అని పోకిరి సినిమాలో మ‌హేశ్ బాబు డైలాగ్ చెబుతాడు. థియేట‌ర్ల‌లో ఈ డైలాగ్ కు ఈల‌లూ, కేక‌లూ, అరుపులూ వినిపించాయి. ఇప్పుడు హుజురాబాద్ లో నాయ‌కుల వంతు వ‌చ్చింది. ఎంట్రీ ఎలా ఉన్నా కూడా  గెల్లు శ్రీ‌ను మాత్రం హ‌రీశ్ సాయంతో స్పీడుగానే పోతున్నడు. కానీ సీనియ‌ర్ అయిన ఈటెల సారును మాత్రం అస్స లు ఢీ కొట్ట‌లేక పోతున్నడు. దీంతో ప్ర‌చారంలో ముందున్నా జ‌నాక‌ర్ష‌ణ‌లో కాస్త వెనుక‌బ‌డిపోతున్నడు. మ‌రి!ఇప్పుడు బుల్లెట్ పే లాలంటే, బ్యాలెట్ వార్ నెగ్గాలంటే ఇంకేముంది వ‌రాల వాన కురిపించుడే! లేదా ఎవ‌రి గొప్ప‌లకు వారు డ‌ప్పు కొట్టుకునుడే!

హుజురాబాద్ ఎన్నిక‌ల వేళ పోలింగుకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఇదే సంద‌ర్భంలో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ఓట‌ర్ల‌ను ఆక ర్షించేందుకు నానా పాట్లూ ప‌డుతున్నాయి. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు గ‌తంలో గులాబీ దండు చేప‌ట్టిన ప‌థ‌కాల‌న్నింటినీ ఏక‌రు వు పెడుతోంది. తామే ఓట‌ర్ల‌కు మంచి చేస్తామ‌ని, త‌మ‌తోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని చెబుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రచార బాధ్య‌త‌లు చూస్తున్న హ‌రీశ్ రావు గ‌తంలో క‌న్నా ఇప్పుడు భిన్నంగా భాష‌ను వినియోగిస్తూ, పాత స్నేహితుడిపై నిప్పులు చెరుగుతూ, వి మ‌ర్శ‌లకు ఉన్న హద్దు కూడా చెరిపేస్తున్నారు. అదేవిధంగా క‌ల్యాణ లక్ష్మి, రైతు బంధు, ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల్లోకి కేసీఆర్ దూసుకుపోయార‌ని, ఆయ‌న వారి హృద‌యంలో చిర స్థానం ద‌క్కించుకున్నార‌ని త‌మ అధినేతను ప్ర‌శంసిస్తూ, ప్ర‌త్య‌ర్థిని తిట్టిపోస్తూ ఉన్నారు. మ‌రోవైపు టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌ను మొద‌లుకుని ఇంకొంద‌రు మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లి  ఓట‌రు ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో వారితో ఎప్ప‌టిక‌ప్పుడు ములాఖ‌త్ అవుతున్నారు. గులాబీ దండుకే చెందిన కొంద‌రు చిన్న,చి న్న నాయ‌కులు గ‌ల్లీల‌లో స‌మావేశాలు పెడుతూ త‌మ పార్టీ చేసిన మంచి ప‌నులు గురించి అలుపు లేకుండా చెబుతున్నారు. ఇవ‌న్నీ ఓట‌రును ప్ర‌భావితం చేస్తాయో లేదో కానీ గొప్ప‌ల‌కు మాత్రం లోటేం లేకుండా ఎవ‌రి ప‌ని వారు కానిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో డప్పుల ద‌రువేస్తూ హ‌రీశ్ రావు చేస్తున్న ప్ర‌చారం ఫొటోలు కొన్ని బీజేపీ మార్ఫింగ్ చేస్తుంద‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఖాళీ డ‌ప్పుపై ద‌రువు వేస్తున్న ఫొటోలు తీసుకుని ఆ డ‌ప్పుపై బీజేపీ కే ఓటేయండి అని రాసి, ఫొటోషాప్ జిమ్మిక్కు ల్లో భాగంగా ఓట‌ర్ల‌ను మ‌భ్య పెడుతున్నారు బీజేపీ నాయ‌క‌వ‌ర్గం. మ‌రోవైపు బీజేపీ అభ్య‌ర్థి ఈటెల రాజేంద‌ర్ మాత్రం చాలా హుషా రుగానే ఉన్నారు. హుజురా బాద్, క‌మ‌లాపూర్ ప్రాంతాల్లో మిన‌హా మిగ‌తా చోట్ల ఈటెల ప్ర‌భంజ‌నం బాగుంద‌ని గ్రౌండ్ రిపోర్ట్ చెబు తోంది. ఈటెల కూడా మాట‌ల తూట‌లు పేలుస్తూనే, కేంద్రంలో బీజేపీ చేస్తున్న ప‌నులు, తాను చేయ‌బోతున్న ప‌నులు గురించి వివ‌రిస్తూ వెళ్తున్నారు. ప్రచార ఆర్భాటం మాత్రం బీజేపీ క‌న్నా టీఆర్ఎస్ కే ఎక్కువ‌గా ఉంది. మాట‌ల ఆర్భాటం కూడా అలానే ఉంది. దీంతో ఎవ‌రి గొప్ప‌లు వారే చెప్పుకునే రీతిలో రాజ‌కీయం చేస్తూ ఓట‌ర‌న్నకు వీలున్నంత మేర‌కు వినోదం పంచుతూనే ఉన్నారు. ఆ విధంగా ఎవ‌రి గొప్ప‌ల డ‌ప్పు వారే కొట్టుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: