ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం విధిత‌మే.  ఏపీలో చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి తాజాగా న‌ర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, మంత్రుల‌పై, ఎమ్మెల్యేల‌పై  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఐని కొట్టిన వైసీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయాల‌ని పేర్కొన్నారు. ఏపీ డీజీపీ స్వేచ్ఛ ఉంటుంది అని అంటున్నారు. ఏవిధమైన స్వేచ్ఛ ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. ఏపీ, తెలంగాణ‌లో కూడ బోస డీకే అనే ప‌దంపై చ‌ర్చ జ‌రుగుతుంది. మా ముఖ్య‌మంత్రిని అన‌లేదని.. దానిని వారి మీద‌కు మ‌ళ్లించారు. న‌న్ను లుచ్చా అని శాస‌న‌స‌భ‌లో అవ‌మానించారు. అయినా నేను దానిని సీరియ‌స్‌గా తీసుకోలేద‌ని వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను తిట్ట‌క‌పోయినా అపార్థం చేసుకున్నారు.

జ‌గ‌న్ ఆగ్ర‌హాన్ని జ‌నాగ్ర‌హ దీక్ష‌గా మార్చారు. చెప్పుడు మాట‌లు విని ఇలా చేస్తున్నారు. జ‌నాగ్ర‌హ దీక్ష‌లో చాలా చోట్ల కుర్చీల‌న్నీ ఖాళీగానే ఉన్నాయి. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష ఎలా చేశార‌ని పేర్కొంటున్నారు. ఆ విధంగా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏముంది.  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఐదు రోజుల పాటు దీక్ష చేశారు. మ‌రి స‌జ్జ‌ల ఎవ‌రినీ అవ‌మానిస్తున్నారు. పార్టీకి ఏదో ఒక న్యాయం చేయాల‌నుకొని అన్యాయం చేస్తున్నారు స‌జ్జ‌ల అని పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మ‌నం చేసిన దీక్ష‌ల‌పై వ్యాఖ్య‌లు చేయ‌లేదు క‌దా..  గంజాయి సాగు చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటే బాగుండు అని అన్నారు. చిన్నస్థాయి నాయ‌కులు కూడ త‌మ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. రాబోయే రోజుల్లో పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని జోస్యం చెప్పారు. ముఖ్య‌మంత్రి మెప్పు కోసం నాయ‌కులు ఏదేదో చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 41ఏ నోటీస్ ఇవ్వ‌కుండా అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని.. అరెస్ట్ చేస్తే పోలీసులపై కూడ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పింది. స‌జ్జ‌ల రాజ్యాంగ అధిప‌తి ముఖ్య‌మంత్రి అంటున్నారు.  ఇటువంటి స‌ల‌హాలు చేప‌ట్టి చెడ్డ పేరు వ‌చ్చింది. ఇప్ప‌టికైనా స‌జ్జ‌ల స‌రైన స‌ల‌హాలు ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్టు తెలిపారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నా అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు బీపీ పెర‌గ‌దా అంటున్నారు. బీపీ పెరిగితే టాబ్లెట్ వేసుకోవాలి. కానీ టీడీపీ కార్యాల‌యాల‌పై దాడి చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉంటే క‌నీసం దాడి చేసిన వారిపై ఇప్ప‌టివ‌ర‌కు ఎఫ్ఐఆర్ కూడ న‌మోదు చేయ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ చేయ‌డం కోసం కేంద్రం చేతిలో ఆర్టిక‌ల్ 356 ఉంటుంది. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపుచేయాలంటే ఆర్టిక‌ల్ 356 ఒక్క‌టే స‌రైన దారి అని వెల్ల‌డించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.


మరింత సమాచారం తెలుసుకోండి: