సౌదీ  తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి ?

ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయినా సౌదీ అరేబియా రాజు ప్రిన్స్ మహమ్మద్ బీన్ సలీమ్ శనివారం కీలక ప్రకటన చేశారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా తమ ప్రభుత్వం, తమ దేశం ఉంటుందని పేర్కోంటూ కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని తెలిపారు.


ప్రపంచ దేశాలు దాదాపు గా అన్నీ పర్యావరణం పై దృష్టి పెట్టాయి.  వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పనిలో పడ్డాయి. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. వివిధ దేశాల్లోని మేథావులు కర్బన ఉద్గారాలను  ఎలా తగ్గించాలి ? అని ఆలోచనలు చేస్తున్నారు. నానాటికీ  పర్యావరణంలో మార్పులు సంభవిస్తుండటం విశ్వ మానవాళిని కలవర పెడుతోంది. పర్యావరణాన్ని కాపాడేందుకు వివిధ దేశాలు ' క్లైమేట్ ఛేంజ్ పార్టనర్ షిప్' పేరుతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. నానాటికీ పెరుగుతన్న ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు మించి పెరగ కుండా చూడాలని  ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.  చాలా దేశాలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి. దీనినే  'నెట్ జీరో ' అంటారు. అంతే కాకుండా దీనినే  'కార్బన్ న్యూట్రాలిటీ' అని కూడా పిలుస్తారు. వచ్చే రెండు మూడు దశాబ్దాలలో కర్బన ఉద్గారాలు ప్రపంచ దేశాలలో విపరీతంగా పెరగనున్నాయని శాస్త్రవేత్తలు పేర్కోంటున్నారు. దీనిని తగ్గించేందుకు ప్రతి దేశం  ప్రయత్నిస్తోంది.
వాహనాలు, పరిశ్రమల ద్వారా విడుదలయ్యే కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. దీనికి సమానంగా పీల్చుకునేందుకు అవసరమైన స్వచ్ఛమైన గాలిని తయారు చేయడాన్ని 'గ్రీన్ హౌస్ గ్యాస్ ' అంటారు.  నెట్ జీరో లేదా  కార్బన్ న్యూట్రాలిటీ అంటే  మనం  పీల్చుకునే గాలి, విడుదల చేసే గాలి సమపాళ్లలో ఉండటం.
ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు 2050 కల్లా 'నెట్ జీరో' లో ఉంటామని ప్రకటించాయి. ఆ మేరకు చట్టాలు చేశాయి. ఇక పోతే జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా,  కెనడా వంటి దేశాలు  'నెటి జీరో 'కు అనుగుణంగా నడుచుకుంటామని ప్రకటించాయి. అయితే ఆ మేరకు చట్టాలు చేయలేదు.
తాజాగా సౌదీ రాజు మహమ్మద్ బీన్ సలీమ్ శనివారం తమ దేశం కూడా 2060 నాటికి 'నెట్ జీరో' అమలు చేస్తామని ప్రకటించారు. అంతే కాదు తమ మిత్ర దేశాలయిన 100 దేశాలలో నెట్ జీరో అమలుకు కృషి చేస్తాయని ప్రకటించి ప్రపంచ దేశాలను ఆశ్చర్య పరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: