చైనా పొరుగుదేశమైన తైవాన్ భూభాగాన్ని తమ దేశంలో కలుపుకోవడానికి చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది అన్న విషయం తెలిసిందే  కొన్ని రోజుల నుంచి సైలెంట్ గానే ఉన్న చైనా ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా గగనతలంలో కి చైనా యుద్ధ విమానాలను పంపి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మొన్నటి వరకు తైవాన్ కు అండగా ఉంటాను అంటూ చెప్పిన అమెరికా ఇక ఇప్పుడు బైడెన్ హయాంలో మద్దతు ఇస్తుందా లేదా అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవలే తాము తైవాన్ కు రక్షణగా నిలుస్తాము అంటూ అమెరికా ప్రకటించింది. తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పింది.



 తైవాన్ దేశానికి రక్షణ కల్పించడం అనేది తమ బాధ్యత అంటూ అమెరికా ప్రభుత్వం చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే తైవాన్ ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన చైనా వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది  ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాము చైనా వైపు ఉంటాను అంటూ స్పష్టం చేశారు. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటుందని అది చైనా అంతర్గత వ్యవహారం అంటూ ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే కొరియర్ ద్వీపంలో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఉత్తరకొరియా ఇలా స్పందించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



 అయితే తైవాన్ విషయంలో అమెరికా అనవసర జోక్యం చేసుకోవడం వల్ల సైనికపరమైన ఉద్రిక్తతలకు అమెరికా తెర లేపుతోంది అంటూ ఉత్తర కొరియా ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక ఈ స్టేట్మెంట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక రకంగా ఉత్తరకొరియా అమెరికా కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు. ఇక అమెరికా ఎలా స్పందించాలి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: