భారత సరిహద్దులలో చైనా మరోసారి భారీగా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించి రెచ్చగొట్టే పనులకు పూనుకుంటుంది. భారత్ కూడా ముందస్తు చర్యగా తన సైన్యాన్ని, ఆయుధాలను కూడా మోహరించడంతో దాదాపు సరిహద్దులలో మరోసారి యుద్దవాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే గతేడాది సంగతి మరిచిపోలేని స్థితిలో ఉన్న భారత్ మరోసారి ఆ సందర్భం రాకుండా జాగర్త పడుతుంది. చైనా మాత్రం మొదటి నుండి కవ్వింపు చర్యలకు పూనుకుంటూనే ఉంది. ఒకపక్క తైవాన్ మరోపక్క భారత్ పై చైనా ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుండటం తో భారత్ కూడా ముందస్తు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.

ఇరుదేశాలు పోటాపోటీగా సరిహద్దులలో సైన్యాన్ని మోహరించడంతో పాటుగా నిత్యం అక్కడే మాక్ డ్రిల్ల్ కూడా చేస్తున్నారు. ఇదంతా కవ్వింపు చర్యలేన లేక చైనా ముందుకు వస్తుందా అనేది చూడాల్సి ఉంది. కానీ భారత్ మాత్రం చైనాపై పూర్తిగా ద్రుష్టి పెట్టె పరిస్థితి లేదు, ఎందుకంటే అసలు చైనా పాక్ వ్యూహమే ఒకళ్ళు మీదకు రాగానే రెండోవాళ్ళు కూడా పడిపోవాలని. అలాంటి సమయంలో చైనా సరిహద్దువరకు వచ్చింది అంటే, పాక్ కూడా కాశ్మీర్ వరకు వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అలాగే ఇప్పటికే భారత్ లో చొరబడిన పాక్ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ కూడా ఒక్కసారిగా యాక్టీవ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. భారత్ ఇవన్నిటిని కూడా సమాధానపరుచుకుంటూ ముందడుగు వేయాల్సి ఉంటుంది.  

అందుకే భారత సైన్యం  అనునిత్యం సరిహద్దులలో అప్రమత్తంగా ఉంటుంది. ఇక ఆయుధాల విషయానికి వస్తే, భారత్ కూడా ఆయా దేశాలను నిలువరించే అనేక అత్యాధునిక ఆయుధాలను మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సమకూర్చుకున్న విషయం తెలిసిందే. పినాక, స్మెర్చ్ రాకెట్ లాంటి వ్యవస్థలను అస్సాం లోని పలు ప్రాంతాలలో భారత్ ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు ఆయుధాలు శత్రుస్థావరాలలోకి చొచ్చుకుపోగలవు, ఇక అవి ఎతైన ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ దూరం కూడా శత్రు స్థావరాలను ధ్వంసం చేయవచ్చు. ఒక్క పినాక వ్యవస్థ కేవలం 44 సెకండ్లలో 75 రాకెట్ల ద్వారా ఒక్కొక్కటి 100-800 మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేయగలవు. దాదాపు దీనితో 75 కి.మీ. మేర ఉన్న లక్ష్యాలను ఛేదించవచ్చు. ఇక స్మెర్చ్ 40 సెకండ్లలో 44 రాకెట్లను పేల్చగలదు. 1200 చ.మీ. ప్రాంతాన్ని ధ్వంసం చేయగలదు. దీనితో 90 కి.మీ. లక్ష్యాలను ఛేదించ వచ్చు. ఇవన్నీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డి.ఆర్.డి.ఓ. రూపొందించింది. వీటితో పాటుగా నాలుగు రెజిమెంట్ల సైన్యం సిద్ధంగా ఉంది. మరో ఆరు రెజిమెంట్ల సైన్యం కూడా తయారుగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: