రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై దాడి చేసేట‌ప్పుడు వింత జోస్యాలు, విచిత్ర ఆరోపణ‌లు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే, ఇవి రాజ‌కీయాల్లో భాగ‌మే వీటిని వాళ్లు సీరియ‌స్‌గా అంటార‌ని అనుకోవ‌డం పొర‌పాటే. తాజాగా విజ‌య‌సాయి రెడ్డి చేప్పిన జోస్యం ఏంటంటే బీజేపీలోకి తెలుగుదేశం విలీనం కాబోతుంద‌ని. అయితే, విలీనం చేయ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌లు పంపారు. కానీ ఇందుకు బీజేపీ ఒప్పుకోవాల్సి ఉంటుంది. టీడీపీని బీజేపీలో విలీనం చేయ‌డానికి చంద్ర‌బాబు చూస్తున్నాడ‌ని విజ‌య‌సాయి ఆరోపించారనే ప్ర‌చారం సాగుతోంది.
 
   
  జ‌న‌సేన‌ను విలీనం చేయ‌మంటే చేయ‌మ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ ది ప్రాంతీయ పార్టీ అస్థిత్వం. అయితే, పార్టీని తీసుకుపోయి బీజేపీలో క‌లిపితే చంద్ర‌బాబుకు లాభం ఏముంటుంది.?  దీనికంటే ఆలోచ‌న లేని ప‌ని ఉంటుందా అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  ఆ మాట‌కు వ‌స్తే ఏ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల‌తో విలీనాలు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 50 శాతం ఓటు బ్యాంకును క‌లిగి ఉంటే మిగిలిన 50 శాతం ఓటు బ్యాంకు ప్రాంతీయ పార్టీలు క‌లిగి ఉన్నాయి. దేశంలో  ప‌దుల సంఖ్య‌లో పార్టీలు ఉన్నాయి. ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి.


 ఇలాంటి భార‌త రాజ‌కీయాల్లో ప్రాంతీయ పార్టీలు పెరుగుతూనే వ‌స్తూనే ఉన్నాయి. చెప్పాలంటే 2004 వ‌ర‌కు జాతీయ పార్టీల అస్థిత్వం దెబ్బ‌తింటూ వ‌చ్చింది. ఆ త‌రువాత కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం త‌ద‌నంత‌రం బీజేపీ రెండు సార్లు అధికారం చేప‌ట్ట‌డంతో జాతీయ పార్టీల పున‌ర్జీవ‌నం అయిన‌ట్టు క‌నిపిస్తోంది అని చెప్పాలి. 2004 కంటే ముందు జాతీయ పార్టీల ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని చెప్పొచ్చు.  ఒక ర‌కంగా జాతీయ పార్టీలు ఉనికి పెంచుకున్నా కూడా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల‌ను ప్ర‌ధానంగా స‌వాల్ చేస్తున్నాయి.


 ప్ర‌స్తుతం బీజేపీకి పోటీగా ప్రాంతీయ పార్టీలు నిలుస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీ బీజేపీలో విలీనం అవుతుందా అనే ప్ర‌శ్న నెల‌కొంటుంది. బీజేపీతో సంబంధాల కోసం టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌నేది వాస్త‌వం. అయితే, విజ‌య సాయి రెడ్డి ఆరోప‌ణ ఏంటంటే వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల‌చ్చ‌డానికి  టీడీపీ వెళ్లి బీజేపీలో క‌లుస్తుందంటున్నారు. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.




 


మరింత సమాచారం తెలుసుకోండి: