ఈ సారి విశాఖపట్నం రాజకీయాలు రసవత్తరంగా జరగనున్నాయా? ఇప్పటివరకు ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న విజయసాయిరెడ్డి...నెక్స్ట్ విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగనున్నారా? అంటే ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని గమనిస్తే కాస్త డౌట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎప్పుడు దూకుడుగా ఉండే విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు...అలాగే చంద్రబాబుపై ఫైర్ అవ్వడం లేదు. అదేవిధంగా విశాఖలో వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు...ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఒక కార్యక్రమాన్నే చేస్తున్నారు.

అయితే ఇదంతా నెక్స్ట్ విజయసాయి....విశాఖ బరిలో దిగడానికే అని ప్రచారం నడుస్తోంది. ఎలాగో విజయసాయి విశాఖలోనే సెటిల్ అయిపోతానని చెప్పారు. ఇదే క్రమంలో ప్రత్యక్ష రాజాకీయాల్లోకి రావాలని విజయసాయి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయసాయి..నెక్స్ట్ ఎన్నికల బరిలో లోక్‌సభ ఎంపీగా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అంటే విజయసాయి విశాఖ పార్లమెంట్ బరిలో దిగడం అనేది ఖాయమని జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ప్రచారం నిజమైతే ఈ సారి విశాఖలో ఫైట్ ఓ రేంజ్‌లో ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే అటు టీడీపీ తరుపున బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారి విశాఖ పార్లమెంట్ బరిలో దిగి ఓటమి పాలయ్యారు. కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే భరత్...సైలెంట్‌గా విశాఖలో పనిచేస్తున్నారు.

మామూలుగా బాలయ్య అల్లుడుగానే కాకుండా....ఎం‌వి‌వి‌ఎస్ మూర్తి మనవడుగా, గీతం విద్యాలయాల ఓనర్‌గా భరత్..విశాఖ ప్రజలకు సుపరిచితమే. కాబట్టి ఈ సారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమాలో భరత్ ఉన్నారు. అయితే వైసీపీ తరుపున విజయసాయి బరిలో దిగితే...అదిరిపోయే ఫైట్ జరగడం ఖాయం. మరి విజయసాయి వర్సెస్ బాలయ్య చిన్నల్లుడు అనే ఫైట్ నెక్స్ట్ ఎన్నికల్లో ఫిక్స్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: