టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడో...రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడో అర్ధం కాకుండా ఉంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి జగన్ మీద ఎంత కోపం ఉందో..జనం మీద కూడా అంతే కోపం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బాబు రాజకీయం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. జగన్ అధికార పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి, ఆయన్ని ఎలాగైనా నెగిటివ్ చేయాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ప్రతిరోజూ జగన్‌పై విమర్శలు చేయడం..ప్రతి అంశంలో జగన్‌పై బురద జల్లడమే చేస్తున్నారు.

అసలు ఇంకా వేరే పని ఏమి పెట్టుకోవడం లేదు. అందుకే ఇప్పటికీ టీడీపీ పికప్ అవ్వలేకపోతుంది. సరే రాజకీయ నాయకుడు కాబట్టి జగన్‌ని దెబ్బకొట్టాలని చంద్రబాబు చూస్తున్నారు బాగానే ఉంది గానీ, జనాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. ఎక్కడైనా ప్రజల తీర్పుని రాజకీయ నాయకులు గౌరవించాలి. వాళ్ళు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి పనిచేయాలి. అంటే బాబుకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు....అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే ప్రశ్నించాలి.

అలా కాకుండా బాబు ఏమో జనాలని ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రతిసారి జనాలపై బాబు ఫైర్ అవ్వడమే వింతగా ఉంది. తాజాగా కూడా టీడీపీ ఆఫీసులో 36 గంటల దీక్ష చేసిన సందర్భంగా మాట్లాడుతూ..బాబు జనంపై ఫైర్ అయ్యారు. కావాలని జగన్‌ని గెలిపించుకున్నారని, ఇప్పుడు అనుభవిస్తున్నారని మాట్లాడుతున్నారు. తాను పోరాడుతుంటే ప్రజలు ఇంట్లో పడుకుంటున్నారని, తనతో పాటు పోరాడాలని అంటున్నారు. అంటే ఇక్కడ బాబు తన ఫ్రస్టేషన్ అంతా జనాల మీద చూపిస్తున్నారు.

అంటే ఏ రకంగా బాబు ఫ్రస్టేషన్ ఉందో అర్ధం అవుతుంది. ఎప్పుడు ఎవరిని గెలిపించాలో ప్రజలకు బాగా తెలుసు....సమయం వస్తే ఎవరినైనా ఇంటికి పంపించేస్తారు. అందుకే చంద్రబాబుని ఇంటికి పంపారు. అలాంటప్పుడు ప్రజలకు ఎలా దగ్గరవ్వాల అనే ఆలోచన వదిలేసి...ఎంతసేపు వారిపైనే ఫైర్ అవ్వడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: